ఏమన్నా అనుకోండి.. ఇది విశ్వాసాలపై జోకులు వేయడం కాదుగాని.. అసలు మన టివిల్లో కనిపించే కొందరు జోస్యులు గురించి ఎంత చెప్పినా తగదు. రోజూ టివిల్లో రాశి చక్రాల గురించి డెయిలీ ఆస్ర్టాలజీ చెప్పడంతో పాటు.. వీరు సెలబ్రిటీల గురించి కూడా చెబుతుంటారు. అయితే అందరూ ఇప్పుడు సడన్ గా.. ఉదయభానుకు కవల పిల్లలు పుడతారని తాము ముందే చెప్పాం అంటూ నానా హంగామా చేస్తున్నారు.
పేర్లు ఎందుకులే కాని.. రెండు మూడు ప్రముఖ ఛానళ్ళలో జోస్యం చెప్పేవారు.. ఆగస్టు 28న మేం చెప్పాం.. ఉదయభానుకు కవల పిల్లలు పుడతారని.. చూశారా అదే జరిగింది అంటూ ఇప్పుడు ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టిన తరువాత నానా హంగామా చేస్తున్నారు. అసలు ఇన్ని రోజులూ వీరెవరికీ ఉదయభాను ప్రెగ్నెంట్ అనే సంగతే తెలియదు. కాని ఆగస్టు 28న సడన్ గా అందరూ ఆమె జాతక చక్రాన్ని పెట్టేసి.. ఆమెకు ఇద్దరు కవలలు పుడతారు అని చెప్పారు. ఈ మిరాకిల్ కు కారణం ఏంటో తెలుసా?
అబ్బే ఏం లేదు. ఆగస్టు 28న ప్రముఖ పేపర్ కు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చింది ఉదయభాను. అసలు ఇన్నేసి నెలల పాటు జనాలకు కనిపించకపోవడం ఎందుకంటే.. తాను గర్భిణినని.. ఇద్దరు కవలలు పుడుతున్నట్లు డాక్టర్లు చెప్పారని.. వచ్చే 10 రోజుల్లో డెలివరి అని.. ఆమె చెప్పింది. ఆ ఇంటర్యూ చదివేసిన ఈ సో కాల్డ్ సెలబ్రిటీ జ్యోతిష్య ఘనులు.. ఆ రోజు మార్నింగ్ వెంటనే ఈ విషయాన్ని తాము ఫైండ్ అవుట్ చేసిన విజ్ఞాన రహస్యం అన్నట్లు ప్రకటించారు. ఈ లాజిక్ చాలామంది జనాలు అర్దమైపోయి.. మన జోస్యులందరూ ఇంతటి కమెడియన్లా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.