ఈ దర్శకుడు కూడా సమర్పకుడు అయ్యాడు

Update: 2020-11-06 08:50 GMT
స్టార్‌ దర్శకులు తమకున్న క్రేజ్‌ ను పెట్టుబడిగా పెట్టి సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. డబ్బులు పెట్టకుండానే తమ పేరును సమర్పకుడిగా వేసేందుకు ఒప్పుకోవడంతో నిర్మాతలుగా మారిపోతున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలువురు దర్శకులు మరియు హీరోలు ఇప్పటికే నిర్మాతలుగా మారిపోయారు. కోలీవుడ్‌ లో స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ కూడా నిర్మాతగా మారాడు. ఈయన సమర్పణలో అంధకారం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఓటీటీ లో విడుదల కాబోతున్న అంధకారం సినిమా టీజర్‌ ను విడుదల చేశారు. విజ్ఞరాజన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా రామచంద్రన్‌.. అర్జున్‌ దాస్‌.. వినోత్‌ కిషన్‌.. కుమార్‌ నటరాజన్‌.. మీనా గోషాల్‌ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా నటించారు. సూపర్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా రూపొందింది. ఈనెల 24న నెట్‌ ప్లిక్స్‌ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. అట్లీ సమర్పకుడు అవ్వడం వల్ల ఈ సినిమాపై తమిళ జనాల్లో మరియు తెలుగు ఆడియన్స్‌ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ముందు ముందు అట్లీ మరిన్ని సినిమాలు చేస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News