'అవ‌తార్-2' టిక్కెట్ 3 వేలు.. దిమ్మ‌తిరిగిపోతుంది బాస్!

Update: 2022-12-11 04:30 GMT
జెమ్స్ కామెరూన్ విజువ‌ల్ వండ‌ర్ 'అవ‌తార్-2 ది వే ఆఫ్ వాట‌ర్' రిలీజ్ కౌంట్  డౌన్ మొద‌లైన స‌గ‌తి తెలిసిందే. మ‌రో ఐదు రోజుల్లో చిత్రం ప్ర‌పంచ  వ్యాప్తంగా  ప్రేక్ష‌కుల  ముందుకొస్తుంది. ఇప్ప‌టికే హాలీవుడ్ రివ్యూలన్నిపాజిటివ్ గా వ‌చ్చేసాయి. అవ‌తార్ ని మించిన మ‌రో అద్భుత‌మైన ప్ర‌పంచంలోకి కామెరూన్ తీసుకెళ్ల‌బోతున్నార‌ని ఫీడ్ బ్యాక్ వ‌చ్చేసింది.

ప్రేక్ష‌కులు ఎవ్వ‌రూ ఊహించ‌ని ఓ కొత్త ప్ర‌పంచాన్నే చూపించ బోతున్నారు..డోంట్ మిస్ అంటూ సంకేతాలు పాస్ చేసేసారు. దీంతో అవ‌తార్ అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా? అన్న ఉత్సాహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. స‌రిగ్గా ఇదే ఇంటెన్ష‌న్ తో  కాసులు చేసుకునే వాళ్లు ఎంచ‌క్కా కాసులు ఖాతాలో వేసుకుంటున్నారు.

అవ‌తార్ -2 టిక్కెట్ ఇండియ‌న్ స్టార్లు..తెలుగు హీరోల మార్కెట్ ని మించి క‌నిపిస్తుంది. ముందుగా ఒక్కో టిక్కెట్ 1500 వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా వేసారు. కానీ దానికి రెట్టింపు ధ‌ర క‌నిపిస్తుంది. ఒక్కో టిక్కెట్ కొన్ని మ‌ల్టీప్లెక్స్ ల్లో 3000 ల‌కు పైగానే  అమ్ముతున్న‌ట్లు నిర్మాత సురేష్ బాబు తెలిపారు. అందుకు స‌రైన  కార‌ణాన్ని చెప్పుకొచ్చారు. నిర్మాత‌లు భారీగా ఖ‌ర్చు చేసారు కాబ‌ట్టి టికెట్ ధ‌రంత ప‌లుకుతుంది. కోటి రూపాయ‌ల్లో చేసిన సినిమ‌కి....వంద కోట్ల తో రూపొందించిన సినిమాకి వ్య‌త్యాసం ఉంది క‌దా అన్నారు.

అవ‌తార్ -2 మ‌ల్టీప్లెక్స్  సినిమా. పూర్తిగా ఆయా థియేట‌ర్లో చూస్తేనే ఆకిక్ దొరుకుతుంది.  పైగా  త్రీడీలో చూడాల్సిన సినిమా. ఈ కార‌ణాల‌న్నింటిని బేస్ చేసుకునే 3000 ధ‌ర‌కు టిక్కెట్ అమ్ముతున్నారు.  ఈ సినిమాకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఆస్వాదించే సినిమా కాబ‌ట్టి ఓస్టార్ హీరో సినిమాకి ఉండే డిమాండ్ ఉంటుంది. వారం రోజుల పాటు అవ‌తార్ -2 టిక్కెట్లు దొర‌క‌డం కూడా క‌ష్టంగానే క‌నిపిస్తుంది.

ఇప్ప‌టికే బుకింగ్స్ అన్ని నిండాయి. 1500 రూపాయ‌ల‌కు టిక్కెట్ అమ్మితే సునాయ‌సంగా వ‌తార్ 35 కోట్లు తెలుగు మార్కెట్ నుంచి క‌లెక్ట్ చేసింద‌ని అంచ‌నా వేసారు నిపుణులు. కానీ రెట్టింపు ధ‌ర‌కి విక్ర‌యిస్తున్నారు కాబ‌ట్టి ఆ నెంబ‌ర్ అంత‌కంత‌కు పెరుగుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News