అవిక.. ఇది చాలా ఓవరమ్మాయ్

Update: 2015-11-25 15:30 GMT
తెలుగు బుల్లితెరపై చిన్నారి పెళ్ళి కూతురు ఆనందిగా ఫుల్‌ పాపులార్టీ సాధించింది అవికా గోర్‌. అందుకే ఆమె నటించిన ఉయ్యాలా జంపాలా సినిమా ఆ రేంజులో హిట్టయ్యింది మరి. అయితే ఆ తరువాత అవిక చేసిన సినిమాలేవీ ఆమెకు పేరును తేలేదులే. ఇప్పుడు 'తను నేను' అనే సినిమాతో వస్తోంది అమ్మడు. ఎల్లుండే రిలీజ్‌. అందుకే తెగ ప్రమోట్‌ చేస్తోంది.

ఈ సందర్భంగా మాట్టాడిన అవిక.. తనతో పాటే సినిమాలో నటించిన సీనియర్‌ యాక్టర్లు బాగానే చేసిందని మెచ్చుకుంటోంది. ''నా తండ్రి క్యారెక్టర్‌ లో నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్టు బాగా నటించారు. సినిమా చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నుండి టిప్స్‌ చాలా నేర్చుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది. బాగానే ఉందీ వయ్యారం.. కాని అలా క్యారెక్టర్‌ ఆర్టిస్టు తొక్కా తోలు అనడం ఏంటి.. కనీసం రవిబాబు అనే పేరు కూడా తెలియదా ఈమెకు? చాలా ఇంటర్యూల్లో మన బంగారం అసలు సినిమాలో తన తల్లిదండ్రుల పాత్రలను పోషించిన రవిబాబు - సత్య కృష్ణ పేర్లు చెబితే ఒట్టు.

ఏమ్మాయ్‌ అవికా.. ఇది చాలా ఓవర్‌ గా అనిపించట్లేదూ? నిజానికి ఒక సినిమాలో చేస్తున్నాం అంటే కనీసం కో-ఆర్టిస్టుల పేర్లు కూడా తెలుసుకోకపోతే ఎలా? యాటిట్యూడ్‌ మారకపోతే ఇక్కడ మనుగడ కాస్త కష్టమే అంటున్నారు జనాలు.
Tags:    

Similar News