అయాన్ ముఖర్జీ విజువల్ వండర్ 'బ్రహ్మాస్త్ర'. కరణ్ జోహార్ తో కలిసి కొతం మంది ప్రొడ్యూసర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. రణ్ బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని మొత్తం మూడు భాగాలుగా రూపొందించారు. ఫస్ట్ పార్ట్ లో భాగంగా 'శివ'ని రీసెంట్ గా విడుదల చేశారు. ఇందులో రణ్ బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. పార్ట్ 1 లో షారుఖ్ ఖాన్ వానరాస్త్రంగా, దీపికా పదుకోన్ జలాస్త్రంగా గంగా దేవిగా శివ తల్లిగా కనిపించింది.
అయితే ఈ రెండు పాత్రలని పూర్తి స్థాయిలో పార్ట్ 1లో చూపించలేదు. పార్ట్ 2లో వీరి పాత్రలు పూర్తి స్థాయిలో కనిపిస్తాయట. ఇదిలా వుంటే ఈ మూవీలో శివగా నటించిన రణ్ బీర్ కపూర్ తండ్రి దేవ్ పాత్రలో పార్ట్ 2లో ఎవరు నటించనున్నారనే చర్చ మొదలైంది.
పార్ట్ 2కు అత్యంత కీలకంగా నిలిచే ఈ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తారని కొంత మంది, లేదు ఆ పాత్రలో రణ్ వీర్ సింగ్ కనిపిస్తారని కొంత మంది.. లేదు లేదు దేవ్ పాత్రలో 'కేజీఎఫ్' స్టార్ యష్ నటించే అవకాశాలే ఎక్కువగా వున్నాయని, ఇప్పటికే కరణ్ జోహార్ తనతో చర్చలు జరుపుతున్నారని మరి కొతం మంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇదిలా వుంటే ఈ పాత్రలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని దించేస్తున్నారంటూ మరో ప్రచారం ఊపందుకుంది.
అయితే ఈ రూమర్ లపై దర్శకుడు అయాన్ ముఖర్జీ భిన్నంగా స్పందించాడు. ఇప్పటి వరకు దేవ్ పాత్రలో ఈ నటులు అయితేనే బాగుంటుందని ప్రచారం చేసిన వారు రేపు ఆ పాత్రని ప్రభాస్ చేత చేయిస్తే మరింత బాగుంటుంది కదా అని ప్రచారం చేయరని నమ్మకమేంటి అంటూ చమత్కరించాడు. ఇదే సందర్భంగా దేవ్ క్యారెక్టర్ ని ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తున్నారో.. ఇష్టపడుతున్నారో అర్థమవుతోందని చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా ఇంత వరకు మేము దేవ్ పాత్ర కోసం ఎవరినీ సంప్రదించలేదని, త్వరలోనే ఆ పాత్రలో నటించే నటుడిని ఫైనల్ చేసి ప్రకటిస్తామని స్పష్టం చేయడంతో ఇంత వరకు దేవ్ పాత్రపై వస్తున్న గాసిప్స్ కి ఫైనల్ గా తెరపడింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.