కొడుకు సర్ప్రైజ్.. బన్నీ ఎంత మురిసిపోయాడో..!

Update: 2023-02-05 16:59 GMT
స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప.  2021లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ తగ్గదేలే అంటూ ఇప్పటికీ హడావిడి చేస్తూనే ఉన్నారు. బన్నీ కూడా తనెంతో ఇష్టంగా కష్టపడి చేసిన ఈ పుష్ప మూవీ తన కెరీర్ లో  ఎంతో ప్రత్యకమని ఇప్పటికీ పలుసార్లు చెప్పాడు కూడా.   అయితే ఆ స్పెషల్ ఫీల్ నీ..  మరింత స్పెషల్ గా మార్చాడు బన్నీ తనయుడు అయాన్.

తాజాగా అయాన్ ఓ లారీ బొమ్మతో బన్నీని సర్ ప్రైజ్ చేశాడు. ఆ లారీ పై పుష్ప అని ఎంతో ప్రేమగా రాసు కొచ్చాడు.  తనయుడు తనకోసం ఇచ్చిన ఆ బొమ్మను చూసి  బన్నీ ఎంతగానో మురిసిపోయాడు. దానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  "క్యూటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ మై స్వీటెస్ట్ సోల్ అయాన్ చిన్ని బాబు అని క్యాప్షన్ రాసి అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన అభిమానులు పుష్ప 2 అప్డేట్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది."

కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన 'పుష్ప'లో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. ఫహాద్‌ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.  ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు  అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే హిందీలో ఓ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.

అయితే బన్నీ ఇంతవరకు తన కొత్త సినిమాలు ప్రకటించలేదు.   పుష్ప 2 కోసం మాత్రమే తన సమయాన్ని కేటాయించాడు. కొత్త సినిమాల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే పుష్ప2 కాకుండా  ఆ తర్వాత బన్నీ చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతం సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలో కూడా ఆసక్తికరంగా మారింది.  అయితే ఇప్పటికే పలు స్టార్ దర్శకులు బన్నీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారీ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు.

ఇక పుష్ప 2 విషయాన్నికొస్తే.. ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతోంది. హీరో  పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్స్‌ని తీర్చిదిద్ది షూటింగ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల చిత్రీకరణ అనంతరం చిత్రబృందం హైదరాబాద్‌ తిరిగి రానుంది. వచ్చే నెలలో మరో కొత్త షెడ్యూల్‌ని ఆరంభిస్తారు. వచ్చే నెలలోనే కథానాయిక రష్మిక  ఈ సెట్లోకి అడుగు పెట్టనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News