పిక్‌ టాక్‌ : పింక్‌లో అందాల రాశి జోరు

దాంతో బాలీవుడ్‌ వైపు ఈ అమ్మడు చూస్తుందా అనే టాక్‌ వినిపిస్తుంది. అందాల రాశి సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్‌ చేస్తుంది.

Update: 2025-01-07 11:46 GMT

తెలుగు ప్రేక్షకులకు ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. తక్కువ సమయంలోనే మంచి సినిమాల్లో, యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ భాషల్లోనూ నటించడం జరిగింది. ఈ మధ్య కాలంలో తెలుగులో కంటే ఎక్కువగా తమిళ్‌, హిందీ భాషల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. టాలీవుడ్‌లో ఎన్నాళ్లు చేసినా ఆశించిన స్థాయిలో పెద్ద ఆఫర్లు రావడం లేదు. దాంతో బాలీవుడ్‌ వైపు ఈ అమ్మడు చూస్తుందా అనే టాక్‌ వినిపిస్తుంది. అందాల రాశి సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్‌ చేస్తుంది.

తాజాగా పిక్ డ్రెస్‌లో తన అందాన్ని చూపించడం ద్వారా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్‌ షో తో చూపు తిప్పనివ్వని ఈ అమ్మడి ఫోటోలకు మంచి స్పందన దక్కింది. రెగ్యులర్‌గా రాశి ఖన్నా సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి అంతకు మించి అందంగా ఈ అమ్మడి అందాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నడుము అందం చూపించడం ద్వారా కవ్విస్తున్న రాశి ఖన్నా బాలీవుడ్‌లో మెల్ల మెల్లగా పాతుకు పోయేందుకు ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేయాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు.

గత సంవత్సరం బాలీవుడ్‌ మూవీ యోధతో పాటు తమిళ్‌ మూవీ అరణ్మైయ్‌ 4 సినిమాలోనూ నటించింది. ఆ సినిమాలో తమన్నాతో సమానంగా అందాల ఆరబోత చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత మరో హిందీ సినిమాతో ఏడాది చివర్లో వచ్చింది. హిందీలో ఇప్పటి వరకు కమర్షియల్‌గా పెద్ద హిట్‌ పడకున్నా ఈ ఏడాదిలోనూ రెండు మూడు సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయ్యిందని తెలుస్తోంది. తెలుగులో ఇంతకు ముందు వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో కాస్త తక్కువ సినిమాలు చేస్తుంది.

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమా చేస్తుంది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ఇదే సమయంలో రాశి ఖన్నా తమిళ్‌తో పాటు హిందీలోనూ బిజీగా ఉంది. ముందు ముందు రాశి ఖన్నా నుంచి తెలుగు సినిమాలు వస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంతో పోల్చితే రాశి ఖన్నాకు టాలీవుడ్‌లో క్రేజ్ తగ్గింది అనిపిస్తుంది. కానీ బాలీవుడ్‌లో వరుసగా ఒకటి రెండు సినిమాలు సక్సెస్‌ అయితే కచ్చితంగా రాశి ఖన్నాను మళ్లీ తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ సంప్రదిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగులో రాశి ఖన్నా మళ్లీ బిజీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.

Tags:    

Similar News