బాహుబలి 2 @ 831 నాట్ ఔట్

Update: 2017-05-06 17:04 GMT
ఏకంగా ఒక వారం రోజులపాటు బాక్సీఫీస్ కు అసలు సిసలైన సునామీ అంటే ఏంటో చూపించింది బాహుబలి 2. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తున్న ఈ రాజమౌళి క్రియేషన్.. ఇప్పుడు రిలీజైన తొలి వారానికి కాను.. అసలు ఎంత వసూలే చేసిందో తెలుసా? ఎన్నెన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలుసా? జస్ట్ సింపుల్ గా రేపటినుండి 'మైండ్ బ్లోయింగ్' అనే బదులు ఇక మీదట మనం ఆ పదాలను 'బాహుబలి' అనే పదంతో రీప్లేస్ చేయొచ్చు.

మొదటివారానికి గాను భారతదేశంలో ఏకంగా 671+ కోట్ల గ్రాస్.. 331+ కోట్ల షేర్ ను వసూలు చేసింది ఈ బాహుబలి రెండో భాగం. రాజమౌళి ప్రభంజనం ఏంటనేది ప్రపంచానికి చాటుతూ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి (అమెరికా + ఇతర దేశాలు).. ఏకంగా 160+ కోట్లు గ్రాస్.. 97 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే మొత్తంగా ప్రపంచంలోని అన్ని మూలల నుండి వచ్చిన మొత్తాన్ని కలిపితే.. ఏకంగా 831+ కోట్లు గ్రాస్ వసూలు చేసింది బాహుబలి. అంటే షుమారుగా 429+ కోట్లు షేర్ అనమాట. ఏ యాంగిల్లో చూసినా కూడా.. ఇది బాహుబలియన్ రేంజ్ విజయం అనే చెప్పాలి.

ఈ మొత్తంలో కేవలం తెలుగు వర్షన్ చూసుకుంటే.. 310 కోట్ల గ్రాస్ (190 కోట్ల షేర్).. అలాగే హిందీ వర్షన్ చూసుకుంటే.. 410 కోట్ల గ్రాస్ (245 కోట్ల షేర్) వసూలు చేసింది.

ఇక రికార్డుల సంగతికి వస్తే.. ఇండియాలో అసలు 800 కోట్ల మార్కును టచ్ చేసిన తొలిచిత్రం బాహుబలి 2. అంతేకాదు.. ఇప్పటివరకు ఇతర సినిమాల పేరిటి ఉన్న ఫస్ట్ డే నెట్ రికార్డ్.. లైఫ్‌ టైమ్ కలక్షన్ రికార్డు.. అప్పుడే వారానికే బాహుబలి 2 పేరున వచ్చేశాయి. అమెరికాలో కూడా ఒక ఇండియన్ సినిమాకు ఉన్న లైఫ్‌ టైమ్ కలక్షన్ రికార్డులన్నీ ఆల్రెడీ ఈ సినిమా పేర బదిలీ అయిపోయాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News