ఇండియా అంతా ఎంతో ఆత్రంగా చూసిన బాహుబలి ది కంక్లూజన్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి భాగంలో వదిలేసిన ఎన్నో పజిల్స్ కు ఆన్సర్ తెలుసుకునేందుకు జనాలు ఆత్రంగా థియేటర్లకు క్యూ కట్టేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 6500 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా.. మొత్తంగా 95 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.
తొలి రోజు వసూళ్ల విషయంలో బాహుబలి2 కొత్త రికార్డులు నమోదు చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ. 36 కోట్లను వసూలు చేసి ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది. ఒక దక్షిణాది చిత్రానికి దేశవ్యాప్తంగా ఈ స్థాయి రెస్పాన్స్ అనేది ఎవరూ ఊహించని విషయం. తొలి రోజు వసూళ్లు.. 100 కోట్లు అని కొందరంటుంటే.. ఇది చాలా చిన్న ఫిగర్ అనేవాళ్లు కూడా ఉన్నారు. కేవలం ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 19 కోట్ల రూపాయలు(3 మిలియన్లు) రిలీజ్ కి ముందే వచ్చాయంటే బాహుబలి2 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.
ముందు రోజు నుంచే షోస్ పడడంతో.. వసూళ్ల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దంగల్.. సుల్తాన్ రికార్డులను దాటేసిన బాహుబలి.. తొలి రోజు కలెక్షన్స్ విషయంలో కొత్త బెంచ్ మార్క్ ను సృష్టించడం ఖాయంగా చెప్పచ్చు. రియల్ ఫిగర్స్ రేపు తెల్లాసరికల్లా వచ్చేస్తాయ్ కాబట్టి.. ఆ బెంచ్ మార్క్ ఏంటో తెలుసుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/