ఇండియా టుడే బాహుబలి కోసమే!!

Update: 2017-04-21 17:14 GMT
బాహుబలి2.. భారతీయ సినిమా చరిత్రను తిరగరాసేస్తుందనే అంచనాల మధ్య.. మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. కనీసం వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంటున్నారు.

అసలు ఈ సినిమాకు ముందు వెనకా వేరే ఏ సినిమా.. ఏ భాషలోనూ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సాహసించడం  లేదంటే బాహుబలి2 రేంజ్ అర్ధమవుతుంది. ఇండియాటుడే మేగజైన్.. తాజా ఎడిషన్ కవర్ పేజ్ పై బాహుబలి కనిపించింది. బాహుబలి ప్రభాస్ ఏనుగు మీదకు తొండంపై నుంచి ఎక్కుతున్న పోస్టర్ ను కవర్ పేజ్ పై వేశారు. పొలిటికల్ మేగజైన్ అయినా.. ట్రెండీ అంశాలకు ప్రాధాన్యతనిచ్చే ఇండియా టుడే.. ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న బాహుబలి గురించి స్పెషల్ కవరేజ్ చేయడంలో ఆశ్చర్యం లేదు.

ఒక తెలుగు సినిమా.. దేశవ్యాప్తంగా హాట్ హాట్ సాగుతున్న రాజకీయాలను కూడా పక్కకు నెట్టి కవర్ పేజ్ పై ఎక్కడం అంటే చిన్న విషయం కాదు. కానీ బాహుబలికి ఆ స్థాయి ఉంది. అందుకే తెలుగు సినిమా గురించి ఇవాళ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ విషయంలో బాహుబలి టీంకి హ్యాట్సాఫ్ చెప్పడంలో ఏ మాత్రం తప్పు లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News