ఏళ్లుగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 మరో రెండు రోజుల వ్యవధిలో థియేటర్లకు రానుంది. ఈ సినిమా కోసం ఇంతకాలం ఓపిగ్గా ఎదురుచూస్తున్న జనాలు.. ఇప్పుడు క్షణం ఒక నిమిషంగా మారి.. శుక్రవారం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అంతేనా.. సినిమా టికెట్ల కోసం వారు పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. తొలిరోజునే సినిమాను చూసేయాలన్న ఆకాంక్ష పెద్ద ఎత్తున చోటు చేసుకోవటం.. దీనికి తగ్గట్లే రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సినిమా ప్రదర్శనకు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఏపీలో రోజుకు ఆరు షోలు.. తెలంగాణలో ఐదు షోలకు ప్రభుత్వం ఓకే చెప్పేయటంతో.. ఈ సినిమా మరింత మంది చూసే అవకాశం లభించిందని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. తాజాగా బాహుబలి 2కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. సినిమాకు సంబంధించిన సీన్ ఒకటి ఉన్న ఫోటో వైరల్ గా మారింది. ఇప్పటివరకూ బాహుబలి 2కి సంబంధించిన ప్రచారంలో వినియోగించని ఈ ఫోటోను చూస్తున్నప్పుడు.. బాహుబలి ప్రీమియర్ షోలను వేయటం షురూ చేశారా? అన్న సందేహం రాక మానదు. ఇప్పటివరకూ ఉన్న అధికారిక సమాచారం ప్రకారం గురువారం సాయంత్రం ఓవర్ సీస్ ప్రీమియర్ షోలతో బాహుబలి 2 రిలీజ్ కానుంది. ఆ లెక్కన ఓవర్ సీస్ లో మొదటి షో పడనుంది.
మరి.. అంతకు ముందే.. ఎక్కడైనా బాహుబలి షోలు వేశారా? అన్నది ప్రశ్నగా మారింది. సిల్వర్ స్ర్ర్కీన్ మీద బాహుబలి 2 టైటిల్ తో పాటు.. ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ రెండింటిని చూసినప్పుడు ఎక్కడైనా ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారా? అన్నది డౌట్ గా మారింది. అయితే.. ఇది సెన్సార్ చేసేటప్పుడు తీసిన ఫోటోలై ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనిపై క్లారిటీ రావాలంటే జక్కన్న అండ్ కో పెదవి విప్పాల్సి ఉంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/