‘బాహుబలి: ది కంక్లూజన్’ వరల్డ్ వైడ్ రూ.1250 కోట్ల దాకా వసూలు చేసేసిందని.. ఇండియాలోనే వెయ్యి కోట్లు వచ్చాయని వార్తలు వస్తుంటే.. ఈ సినిమా తెచ్చింది 600 కోట్లే అనడమేంటి అంటారా? ఇక్కడ మాట్లాడుతోంది గ్రాస్ వసూళ్ల గురించి కాదు.. షేర్ గురించి. రెండు వారాల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ సాధించి షేర్ రూ.613 కోట్లే. ప్రభుత్వాల పన్నులు.. థియేటర్ల రెంట్లు.. పబ్లిసిటీ.. ఇతర ఖర్చులు అన్నీ తీసేసి.. డిస్ట్రిబ్యూటర్ కు వచ్చిన నిఖార్సయిన ఆదాయమే ‘షేర్’ అంటే. ‘బాహుబలి-2’ అలా రెండు వారాల్లో సాధించిన మొత్తం రూ.613 కోట్లు. వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.1214 కోట్ల దాకా ఉంది.
తెలుగు రాష్ట్రాల వరకు బాహుబలి-2 రూ.232 కోట్ల గ్రాస్.. రూ.160 కోట్ల షేర్ వసూలు చేసింది రెండు వారాల్లో. ఏపీ.. తెలంగాణల్లో ఈ చిత్రం దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసింది. నైజాంలో రూ.53.6 కోట్లు.. సీడెడ్లో రూ.27.8 కోట్లు.. ఉత్తరాంధ్రలో రూ.21.26 కోట్లు.. తూర్పుగోదావరిలో రూ.14.6 కోట్లు.. పశ్చిమగోదావరిలో రూ.10.66 కోట్లు.. గుంటూరులో రూ.14.78 కోట్లు.. కృష్ణాలో రూ.11.3 కోట్లు.. నెల్లూరులో రూ.6.14 కోట్లు షేర్ వసూలు చేసిందీ చిత్రం. కర్ణాటకలో గ్రాస్ రూ.83.4 కోట్లు.. షేర్ రూ.39.4 కోట్లు వచ్చాయి. తమిళనాట గ్రాస్ రూ.97 కోట్లకు చేరుకుంది. షేర్ రకూ.51.28 కోట్లు వచ్చింది. అమెరికాలో ఈ సినిమా రూ.112 కోట్ల గ్రాస్.. రూ.73.2 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/