రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌ లో దుమ్ము రేపిన 'బాహుబలి'

Update: 2019-10-20 06:51 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి చెక్కిన 'బాహుబలి'కి మరో అద్బుతమైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమాకు అంతెందుకు ఏ ఇంగ్లీష్‌ యేతర సినిమాకు దక్కని గౌరవం బాహుబలికి దక్కింది. 1987లో ప్రారంభం అయిన చారిత్రాత్మక లండన్‌ రాయల్‌ ఆల్ బర్ట్‌ హాల్‌ లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించారు. చాలా రోజుల క్రితమే బాహుబలి సినిమాను రాయల్‌ ఆల్ బర్ట్‌ హాల్‌ లో సినిమాను ప్రదర్శించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఎప్పుడెప్పుడా అంటూ ఆ సమయం కోసం అంతా ఎదురు చూశారు.

రాయల్‌ ఆల్ బర్ట్‌ హాల్‌ లో దాదాపుగా 5250 మంది కూర్చునే వీలు ఉంటుంది. బాహుబలి ప్రదర్శణకు భారీ ఎత్తున తెలుగు వారు హాజరు అయ్యారు. సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో ఈలలు.. గోలలు.. చప్పట్లతో చారిత్రాత్మక రాయల్‌ ఆల్ బర్ట్‌ హాల్‌ దద్దరిల్లింది. ఇప్పటి వరకు హాలీవుడ్‌ సినిమాలను మాత్రమే అక్కడ ప్రదర్శించారు. మొదటి సారి తెలుగు సినిమాను ప్రదర్శించడం.. బాహుబలికి వచ్చిన స్పందన చూసి అంతా షాక్‌ అవుతున్నారు.

రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌ లో బాహుబలి సినిమా ప్రదర్శణ సందర్బంగా రాజమౌళి.. ప్రభాస్‌.. రానా.. అనుష్క.. కీరవాణిలు హాజరు అయ్యారు. కీరవాణి నేతృత్వంలో అక్కడ సంగీత ప్రదర్శణ కూడా ఏర్పాటు చేశారు. ఇండియన్‌ సినిమాకే ఇది గౌరవంగా అంతా భావిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని బాహుబలితో ఎక్కడికో తీసుకు వెళ్లిన జక్కన్న ఇప్పుడు మరోసారి తెలుగు వారు ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పుకునేలా చేశాడు.

ప్రస్తుతం జక్కన్న రాజమౌళి 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' చిత్రాన్ని రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లతో తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. అది కూడా బాహుబలి రేంజ్‌ లోనే జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ చిత్రంతో మరెంతగా తెలుగు సినిమా స్థాయిని జక్కన్న పెంచుతాడో చూడాలి.
Tags:    

Similar News