బాహుబలికి కలిసొచ్చిన ప్రచారం

Update: 2015-06-27 07:30 GMT
మొన్నామధ్య అనుష్క, రానా, నాని, రాజమౌళి భార్య రమ వారి కుమారుడు కార్తికేయ, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సహా అందరూ చిత్ర విచిత్ర వేషధారణతో దర్శనిమిచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా బాహుబలి ప్రీ రిలీజ్ పార్టీ అని అంతా ఢంకా మోగింది. కానీ అసలు విషయం వేరే వుంది.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు దర్శకుడూ అయిన ప్రకాష్ కోవెలమూడి పుట్టినరోజు వేడుకట అది. ఆ ముక్క రానా చెప్పకుండా ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అందరూ ఇది బాహుబలి పనే అనుకున్నారు. పాపం ప్రకాష్ భార్య, సైజ్ జీరో సినిమాకి రచయిత అయిన కనిక కోవెలమూడి ఎంతో ప్లానింగ్ తో తన భర్తను అబ్బురపరచాలని చూస్తే చివరికి జరిగిన దానికి తానే ఇప్పటివరకూ షాక్ నుండి బయటకు రాలేని పరిస్థితి. ప్రకాష్ మాత్రం తన భార్య ఇచ్చిన సర్ప్రైజ్ కి బాగానే ఇంప్రెస్ అయ్యారట. రామ్ చరణ్ (యాంటి హీరో గెటప్) సహా సినీ ప్రముఖులు హాజరయిన ఈ కార్యక్రమానికి సైజ్ జీరోలో ముఖ్య పాత్ర పోషిస్తున్న తమిళ హీరో ఆర్య షూటింగ్ కారణంగా రాకపోయినా ప్రకాష్ కి విషెష్ ను తెలియజేశాడు. షూటింగ్ కూడా పూర్తి కావచ్చిందట. ఏమైనా ఈ కార్యక్రమం బాహుబలి సినిమాకి ప్రచారంగా మారిపోయిందనేది వాస్తవం.  
Tags:    

Similar News