బాబు గోగినేని సెటైర్..సీన్ లోకి అత‌నొస్తాడా?

Update: 2022-03-20 15:30 GMT
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా సినిమా ప్రేక్ష‌కాభిమానుల్ని ఆక‌ట్టుకులేక‌పోయింది. తాజాగా ఈ సినిమాపై  హేతువాది..బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బాబు గోగినేని సంచ‌ల‌న త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

``మీరు మీ అబ‌ద్దాలు..కెప్ల‌ర్ నిజంగా ఏమ‌న్నారంటే?   జ్యోతిష్య  శాస్ర్తం అనేది ఖ‌గోళ శాస్ర్తం నుంచి పుట్టిన చిన్న పూలిష్ బేబి``. బుద్ది ఉన్నోడు ఎవడైనా వాట్సాప్ సందేశాలు చూసి డైలాగులు రాస్తాడా?  సినిమా తుస్ అంట‌గా..సినిమా తీసే ముందు విక్ర‌మాదిత్య తో జాతకం చూపించుకోవాల్సింది అంటూ గోగినేని సెటైర్లు వేసారు.  అంతేకాదు కెప్లర్ కు సంబంధించిన ఓ లింక్ కు కూడా ఈ పోస్టుకు జత చేశాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై అభిమానులు స‌హా మరి కొంత‌మంది అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు.

సినిమాని సినిమాగానే చూడకుండా ఇలాంటి అర్ధం లేని కామెంట్లు  చేయ‌డం భావ్యం కాద‌ని మండిప‌డుతున్నారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ రిప్లై ఇస్తారేమో చూడాలి. ఈ విష‌యంలో ఎవ‌రి న‌మ్మ‌కం వాళ్ల‌ది?  కాబ‌ట్టి ద‌ర్శ‌క‌డుఉ వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మైతే ఉంది.

`రాధేశ్యామ్` విధిరాత‌..జాత‌కం నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం. ఇందులో ప్ర‌భాస్ హ‌స్త‌సాముద్రిక నిపుణుడి పాత్ర‌ల న‌టించారు. చేతి గీత‌ల్ని బ‌ట్టి ఎవ‌రి భ‌విష్య‌త్ నైనా చెప్పే స‌త్తా ఉన్న వ్య‌క్తి పాత్ర‌. అత‌డి ప్రేమ విష‌యంలో జాత‌కం ఎలా ఉంటుంది? ఎలాంటి ప‌రిణ‌ఫ‌మాలు చోటు చేసుకుంటాయి? అనేది సినిమా క‌థ‌. ఒక స‌న్నివేశంలో కృష్ణంరాజు కెప్ల‌ర్ గురించి చెబుతారు. అది అబ‌ద్దం అని బాబుగోని ఖండించారు..ఆ వివ‌ర‌ణ‌లో భాగంగా `రాధేశ్యామ్` పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించిన‌ట్లు తెలుస్తోంది.

సినిమాల‌పైనే కాదు..ప్ర‌ముఖ‌ల‌పైనా పంచ్ లు వేయ‌డం లో గోగినేని  సిద్ద‌హ‌స్తుడు. ఆ మ‌ధ్య చాగంటి వ్యాఖ్య‌ల‌పైనా త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌ళు గుప్పించారు. ప్ర‌పంచం సైన్స్ ఆధారంగా ముందుకు వెళ్తుంటే...మ‌నం ఇంకా ఎక్క‌డో ఉన్నామంటూ సంద‌ర్భం దొరిక‌న‌ప్పుడ‌ల్లా గోగినేని విమ‌ర్శిస్తుంటారు. ఆ మ‌ధ్య `అఖండ‌`పైనా గోగినేని సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే.

హిందుత్వంపైనా..ఆల‌య‌ల‌పైనా అఖండ‌లో బాల‌య్య చెప్పిన డైలాగుల్ని సైతం గోగినేని వదిలిపెట్ట‌లేదు. జీస‌స్ ని ప్రేమించే దేశాల‌న్ని సాంకేతికంగా సైన్స్ ని న‌మ్ముకుని అభివృద్దిలోకి వ‌చ్చాయి. జీస‌స్ పైనే న‌మ్మ‌కం పెట్టుకోలేదు. మ‌నం మాత్రం సైన్స్ తో పాటు  దేవుళ్లు..దేవ‌తలంటూ స‌మ‌యం వృద్ధా చేసున్నామ‌ని మండిప‌డిన సంద‌ర్భాలున్నాయి. 
Tags:    

Similar News