మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు అంతకంతకు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ .. మంచు విష్ణు అధ్యక్ష పదవులకు పోటీపడుతుంటే జీవిత రాజశేఖర్- బండ్ల గణేష్ ఒకరితో ఒకరు జనరల్ సెక్రటరీ పదవికి పోటీపడుతున్నారు. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం పలువురు పోటీబరిలో నిలుస్తున్నారు.
ఇప్పుడు ఊహించని విధంగా సీనియర్ నటుడు బాబు మోహన్ ఉపాధ్యక్షునిగా పోటీకి దిగుతున్నానని ప్రకటించడం షాకిచ్చింది. కోట శ్రీనివాసరావు తో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చక్కని కామెడీ పండించిన బాబు మోహన్ చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో ఆయన అదృష్టం పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాజకీయాల్లోనూ కలిసొచ్చిందేమీ లేదు.
ఆయన ఇప్పుడిలా ఆర్టిస్టుల సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కోట.. బాబు మోహన్ నటులుగా ఫామ్ లో ఉన్న సమయంలో అసలు `మా` ఎన్నికలు అంటే ఎవరికీ తెలియనే తెలీదు. మురళీమోహన్ వంటి సీనియర్ ని అప్పట్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భాలున్నాయి. అప్పట్లో సంఘంలో సభ్యుల సంఖ్య కూడా చాలా పరిమితం. గడిచిన దశాబ్ధ కాలంలో మా సభ్యుల సంఖ్య 950 కి చేరుకుంది. ఇప్పటికీ పలువురు అగ్ర కథానాయికలు ముఖ్యమైన స్టార్లు `మా` లో మెంబర్లు కాని సంగతి తెలిసిందే.