బేబి సాంగ్‌: ఓ రెండు ప్రేమ మేఘాలిలా..!

Update: 2022-12-20 14:50 GMT
ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య జంట‌గా నటించిన చిత్రం `బేబీ` సాయి రాజేష్ దర్శకత్వం వహించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌.కె.ఎన్ నిర్మించారు. ఈ సినిమా ప్ర‌చారంలో చిత్ర‌బృందం స్పీడ్ పెంచింది.

తాజాగా మూవీ నుంచి మొదటి సింగిల్ ని ఆవిష్కరించారు. ` ఓ రెండు ప్రేమ మేఘాలలిలా....` అంటూ సాగే ఈ పాట ఎంతో మెలోడియ‌స్ ట్యూన్ తో కుర్ర‌కారు హృద‌యాల‌ను హ‌త్తుకుంటోంది. నాయ‌కానాయిక‌ల న‌డుమ ఘాడ‌మైన ప్రేమ భావ‌న‌లు..  భావోద్వేగాలను ఆవిష్క‌రించే గీతమిది. ప్రేమ‌ క‌థాంశానికి త‌గ్గ‌ట్టు లిరిక్ కుదిరింది.

శ్రావ్యమైన ట్యూన్ విన‌సొంపుగా హృద‌యాల్లోకి చేరుతోంది. ఈ పాట‌లో లోతైన స్ప‌ర్శ‌.. కొత్తదనం శ్రోత‌ల‌ను మైమ‌రిపిస్తుంది.  సాహిత్యం అత్యుత్తమ ప్ర‌మాణాల‌ను ఆవిష్క‌రించింది. విజయ్ బుల్గానిన్ ఈ పాట‌కు ట్యూన్ అందించారు. కంపోజిషన్ థీమ్ తో సింక్ అద్భుతం. బుల్గానిన్ ప‌నిత‌నం ఈ పాట‌లో క‌నిపించింది. మెలోడీతో కూడుకున్న స్వర విన్యాసాలు కూడా బాగున్నాయి. హృద‌యాల‌ను గెలుచుకునే విన్నింగ్ మెలోడియస్ పాట విన్నామ‌న్న అనుభూతి సంగీత ప్రియుల‌కు క‌లుగుతుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడిగా టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన ఆనంద్ దేవ‌ర‌కొండ నెమ్మ‌దిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ప్రామిసింగ్ న‌టుడిగా ప్రూవ్ చేసుకునేందుకు అత‌డు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. గ‌త ఏడాది `పుష్ప‌క విమానం` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కాడ‌ని ప్ర‌శంస‌లు కురిసాయి. ఇప్పుడు `క‌ల‌ర్ ఫోటో` చిత్రానికి రైట‌ర్ గా ప‌నిచేసిన సాయి రాజేశ్ తో ఆనంద్ సినిమా అన‌గానే ఆస‌క్తి నెల‌కొంది. క‌ల‌ర్ ఫోటో చిత్రం క‌రోనా స‌మ‌యంలో విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News