తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామానికి చెందిన బేబీ 'ప్రేమికుడు' సినిమాలోని 'ఓ చెలియా నా ప్రియ సఖియా' అనే పాట పాడడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఆ వీడియో ఏఆర్ రెహమాన్ వరకూ చేరడంతో ఆమెను అభినందిస్తూ ఆమె వీడియోను షేర్ చేయడంతో ఆమె మరింత పాపులర్ అయింది. సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన తెలుగు సింగర్ బేబీ ఇప్పుడు సెలబ్రిటీలను కలవడం కామన్ అయింది. సాధారణ సంగీత ప్రియులే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు బేబమ్మను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె బేబీ చేత మొదటి పాటను రికార్డింగ్ చేయించిన సంగతి తెలిసిందే.
ఈ పాటకు పాపులర్ డైలాగ్ రైటర్ లక్ష్మి భూపాల సాహిత్యం అందించాడు. బేబీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ పాటను రాయడం జరిగిందని అయన వెల్లడించాడు. పల్లె కోయిల అంటూ సాగే ఈ పాటకు రఘు కుంచె బాణీకట్టాడు. ఈ పాటను 'పలాస 1978' అనే తెలుగు చిత్రం కోసం రఘు రికార్డ్ చేశాడట. ఈ పాట రికార్డింగ్ కు సంబంధించిన వీడియో రఘు కుంచె రీసెంట్ గా రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో తన మొదటి రికార్డింగ్ కు ఆమె కాస్త తడబడడం.. రఘు కుంచె ఆమెను ప్రోత్సహించడం.. ఆ తర్వాత ఆమె ఆ పాటను అలవోకగా పాడడం మనం చూడొచ్చు.
త్వరలో ఈ పల్లె కోయిల పాట రిలీజ్ అవుతుందని సమాచారం. ఇప్పుడు బేబీ కి ఉన్న సోషల్ మీడియా అటెన్షన్ ని బట్టి చూస్తే ఈ పాట విడుదల కాగానే వైరల్ గా మారడం మాత్రం ఖాయం.
Full View