చాలా కాలం తర్వాత ప్రభుదేవా తన రేంజుకు తగ్గ చిత్రంలో నటిస్తున్నారా? అంటే అవుననే తాజాగా రిలీజైన `భగీరా` టీజర్ చెబుతోంది. అభినేత్రి.. ఏబీసీడీ అంటూ ప్రయోగాలు ఎన్ని చేసినా తన స్థాయి ఎలివేట్ కాలేదు. కానీ ఇప్పుడు తనని ఓ విలక్షణ నటుడిగా ప్రెజెంట్ చేసుకునే అవకాశం అతడికి లభించిందని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదారు గెటప్ లతో ప్రభుదేవా సర్ ప్రైజ్ చేయబోతున్నారు. లవర్ బోయ్ కం సైకోగా అతడి నటవిన్యాసాలు పీక్స్ లో చూపించబోతున్నారని భగీరా టీజర్ చెబుతోంది. ఈ సినిమా తమిళ టీజర్ ని ధనుష్ ఆవిష్కరించగా అది అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో అమీరా దస్తూర్ కథానాయిక.
ఇక టీజర్ లో ప్రభుదేవా రకరకాల వేషాలతో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నారు. తొలిసారిగా అతడు బట్టతల తల గెటప్ తోనూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభుదేవా సైకో కిల్లర్‌గా కనిపిస్తాడు. కిల్లర్ అవతారం కోసం అనేక రూపాల్లోకి మారుతుండాటని టీజర్ లో చూపించారు. అమైరా దస్తూర్ - రమ్య నంబీసన్- జనని అయ్యర్- సాంచిత శెట్టి- గాయత్రి శంకర్- సాక్షి అగర్వాల్ లాంటి భామలు నటించారు. 7/ జి బృందావన కాలనీ ఫేం సోనియా అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది.
అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ మూడవ సినిమా. మూడేళ్ళ గ్యాప్ తర్వాత భగీరాతో సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భరతన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గణేశన్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.Full View
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదారు గెటప్ లతో ప్రభుదేవా సర్ ప్రైజ్ చేయబోతున్నారు. లవర్ బోయ్ కం సైకోగా అతడి నటవిన్యాసాలు పీక్స్ లో చూపించబోతున్నారని భగీరా టీజర్ చెబుతోంది. ఈ సినిమా తమిళ టీజర్ ని ధనుష్ ఆవిష్కరించగా అది అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో అమీరా దస్తూర్ కథానాయిక.
ఇక టీజర్ లో ప్రభుదేవా రకరకాల వేషాలతో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నారు. తొలిసారిగా అతడు బట్టతల తల గెటప్ తోనూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభుదేవా సైకో కిల్లర్‌గా కనిపిస్తాడు. కిల్లర్ అవతారం కోసం అనేక రూపాల్లోకి మారుతుండాటని టీజర్ లో చూపించారు. అమైరా దస్తూర్ - రమ్య నంబీసన్- జనని అయ్యర్- సాంచిత శెట్టి- గాయత్రి శంకర్- సాక్షి అగర్వాల్ లాంటి భామలు నటించారు. 7/ జి బృందావన కాలనీ ఫేం సోనియా అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది.
అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ మూడవ సినిమా. మూడేళ్ళ గ్యాప్ తర్వాత భగీరాతో సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భరతన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గణేశన్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.