అక్క‌డ బాహుబ‌లికి 12 - మెర్స‌ల్‌ కు 12

Update: 2018-08-16 04:35 GMT
సైమా 2018 అవార్డుల సంద‌డి జోరందుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణాది నాలుగు భాష‌ల సినిమాల‌కు అవార్డులు అందించ‌నున్నారు. తెలుగు - త‌మిళం - క‌న్న‌డ - మ‌ల‌యాళ చిత్రాల నామినేష‌న్స్‌ ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. ఈ అవార్డుల్లో బాహుబ‌లి2 - ఘాజీ - గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి - నేనే రాజు నేనే మంత్రి - శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాలు పోటీప‌డుతున్నాయి. బాహుబ‌లి 2 గ‌రిష్టంగా 12 నామినేష‌న్ల‌తో పోటీలో టాప్‌ లో ఉంది. అలానే క‌న్న‌డ నుంచి పునీత్ రాజ్‌ కుమార్ న‌టించిన రాజ‌కుమార‌ - ర‌శ్మిక మంద‌న- గ‌ణేష్ న‌టించిన ఛ‌మ‌క్ చిత్రాలు తొమ్మిదేసి నామినేష‌న్ల‌తో స్పీడ్‌ మీదున్నాయి.

త‌మిళ - మ‌ల‌యాళ చిత్రాల జాబితా ప‌రిశీలిస్తే.. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన `మెర్స‌ల్` 12 నామినేష‌న్ల‌తో రేసులో నిలిస్తే - విక్ర‌మ వేద చిత్రం 9 నామినేష‌న్ల‌తో ఆ త‌ర్వాతి స్థానంలో ఉంది.  మ‌ల‌యాళ సినిమాల్లో `ప‌ర‌వ` 10 నామినేష‌న్ల‌తో టాప్ ప్లేస్‌ లో ఉంటే - `తొండిముత‌ల‌మ్ ద్రిక్ష‌క్షియుమ్` 9 నామినేష‌న్ల‌తో ఆ త‌ర్వాతి స్థానంలో ఉంది. దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఉత్సవాల‌కు నాలుగు భాష‌ల నుంచి స్టార్లు ఎటెండ్ కానున్నారు.

బాహుబ‌లి 2 చిత్రం టాప్ నామినేష‌న్ల‌తో రేస్‌ లో ఉంది కాబ‌ట్టి ఆర్కా యూనిట్ ఈ సంబ‌రాల్లో పాల్గొంటుంద‌ని తెలుస్తోంది. సెప్లెంబ‌ర్ 14 - 15 తేదీల్లో ఈ వేడుక‌లో దుబాయ్‌ లో జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌తియేటా గ‌ల్ఫ్ దేశాల్లో సైమా అవార్డు ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News