చంటిగాడు త్వరలోనే ఒక ఇంటివాడు

Update: 2016-08-02 14:21 GMT
హీరో బాలాదిత్య ఆ మధ్యన ''1940లో ఒక గ్రామం'' సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినా కూడా.. ఎందుకో ఆ క్రేజ్ ను అస్సలు క్యాష్‌ చేసుకోలేకపోయాడు. ఒక్కసారి మనోడి ప్రస్థానాన్నిచూస్తే..  'లిటిల్ సోల్జర్స్' 'హిట్లర్' వంటి సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్టు.. ''చంటిగాడు'' సినిమాతో హీరోగా పరిచయ్యాడు. అప్పటినుండి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి పాట్లు పడుతూనే ఉన్నాడులే.

సినిమాల్లో పూర్తిగా ఖాళీ అయిపోవడంతో.. యాంకరింగ్ వైపు పరుగులు తీసిన ఈ కుర్రాడు.. అక్కడ బాగానే సెట్టయ్యాడని చెప్పాలి. ఇప్పుడు ఈటివిలో ఒక క్విజ్ షో యాంకరింగ్ చేస్తున్నాడు. కొత్త షో లు ఏమైనా చేస్తున్నాడో లేదో తెలియదు కాని.. ఈ సక్సెస్ ఇచ్చిన కిక్కుతో చక్కగా ఒక ఇంటోడు అయిపోతున్నాడు. ఈ ఆగష్టు 6న మానస అనే అమ్మాయిని పెళ్ళిచేసుకోబోతున్నాడు బాలాదిత్య. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తాజ్ మహల్‌ హోటల్ లో మనోడు 12వ తేదీన ఫిలిం ఇండస్ర్టీకి రిసెప్షన్‌ ఇవ్వనున్నాడు.

పెళ్ళి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం అని తెలుసుకుని.. సినిమాల్లో సక్సెస్ ఎలా ఉన్నప్పటికీ లైఫ్‌ లోని ఈ తంతును హ్యాపీగా ముగించడానికి సిద్దపడ్డాడట. మరి పెళ్ళి తరువాత మనోడి కెరియర్ కూడా బాగా టర్న్ అవుతుందని ఆశిస్తున్నారు సన్నిహితులు. అది సంగతి.
Tags:    

Similar News