నందమూరి బాలకృష్ణ 99 సినిమాలు కంప్లీట్ చేసేసి, వందో సినిమాతో సంచలనానికి సిద్ధం అయిపోతున్నారు. ఎవరితో చేస్తారు.. ఏ మూవీ చేస్తారు.. లాంటి ప్రశ్నలన్నిటికీ దాదాపు సమాధానం వచ్చేసింది. బోయపాటి శ్రీను - సింగీతం శ్రీనివాసరావు - అనిల్ రావిపూడి - కృష్ణ వంశీ.. ఇలా వరుసగా మారుతూ వచ్చిన సెర్చింగ్.. చివరకు క్రిష్ దగ్గర ఫుల్ స్టాప్ పడ్డట్లే.
కాకతీయుల్లో ఆఖరి చక్రవర్తి అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి ని ప్రధాన పాత్రగా తీసుకుని, క్రిష్ చెప్పిన స్టోరీ బాలయ్యకు సూపర్బ్ గా నచ్చేసింది. ఈ తరహా రోల్స్ పై బోలెడంత మక్కువ ఉన్న బాలయ్య.. క్రిష్ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించనున్నారాయన. అయితే టైటిల్ విషయంలోనే ఇంకా కన్ ఫ్యూజన్ కంటిన్యూ అవుతోందట. గౌతమీ పుత్ర శాతకర్ణి... ఇది చాలా లెంగ్తీ టైటిల్ కావడంతో.. దీనిపై మరింత కసరత్తు చేసి.. చివరకు ఓ ఆప్షన్ దగ్గర ఆగారని తెలుస్తోంది. అదే 'యోధుడు'.
యోధుడు అన్న టైటిల్ అయితే.. గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రకు కరెక్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం యోధుడుపై బాగా నిరుత్సాహంగా ఉన్నారు. పవర్ఫుల్ టైటిల్ సంగతేమో కానీ.. వినడానికే ఇదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉందే అనుకుంటున్నారు అభిమానులు. గతంలో యోధ వంటి పేర్లతో కొన్ని డబ్బింగ్ సినిమాలు రావడంతో.. ఆ ఇంప్రెషన్ జనాలపై కనిపిస్తోంది.
అయినా.. గౌతమిపుత్ర శాతకర్ణి అనే పేరు.. తెలుగు పిల్లోళ్లకు పుస్తకాలు ప్టటుకున్నప్పటి నుంచి పరిచయమే కదా... ఈ విషయంలో అంతగా ఆలోచించడం ఎందుకో!