హీరో.. హీరోయిన్.. సెలబ్రెటీ ఎవరైనా బయటకు వెళ్లిన సమయంలో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. స్టార్ డమ్ ను బట్టి అభిమానులు ఎక్కువగా ఉంటారు.. వారు నలుగురిలోకి వెళ్లిన సమయంలో ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు అభిమానుల వల్ల హీరోలు హీరోయిన్స్ ఇబ్బంది పడితే కొన్ని సార్లు హీరోలు హీరోయిన్స్ వల్ల అభిమానులు దెబ్బలు తిన్న సందర్భాలు ఉంటాయి.
సెలబ్రెటీల యొక్క బౌన్సర్ లు అభిమానులపై దాడులు చేసిన సంఘటనలు మనం చాలా చూశాం. అభిమానంతో హీరో ను లేదా హీరోయిన్ ను చూసేందుకు వస్తే బౌన్సర్స్ తో కొట్టించారు అంటూ చాలా సార్లు సోషల్ మీడియాలో కొందరు హీరోలు.. హీరోయిన్స్ గురించి విమర్శలు వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
బాలకృష్ణ మాత్రం తన బౌన్సర్స్ తో కొట్టించకుండా తానే స్వయంగా అభిమానులను అప్పుడప్పుడు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. పలు సార్లు అభిమానంతో మీదకు వచ్చిన వారిని బాలయ్య నెట్టి వేయడం.. కొట్టడం.. వారి చేతిలో ఫోన్ ను లాక్కోవడం వంటివి చేసిన విషయం తెల్సిందే. అయితే బాలయ్య తన అభిమానులను కొట్టడంను ఎప్పుడూ సమర్థించుకుంటూ ఉంటాడు.
ఆ మధ్య ఒకసారి బాలయ్య ఆ విషయమై స్పందిస్తూ.. నా చేతిలో దెబ్బ తిన్న అభిమానులు బాధ పడరు అని.. వారు ఆనందంగా ఉంటారని అన్నాడు. నా చేయి తాకినందుకు వారు సంతోషిస్తారు అంటూ బాలయ్య పేర్కొన్నాడు. తాజాగా సాయి మాధవ్ బుర్ర ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య తో పలు సినిమాలకు వర్క్ చేసిన సాయి మాధవ్ బుర్ర ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అభిమానులను బాలయ్య కొట్టడం పై స్పందించాడు. ఆయన బాలయ్య ను ఈ విషయమై ప్రశ్నించాడట. అప్పుడు బాలయ్య నుండి వచ్చిన సమాధానం ఆశ్చర్యపర్చిందని సాయి మాధవ్ బుర్ర పేర్కొన్నాడు.
ఇతర హీరోలు బయటకు వెళ్లిన సమయంలో బౌన్సర్లను పెట్టుకుంటారు. కానీ నాకు బౌన్సర్లు అక్కర్లేదు. డబ్బులు ఇచ్చి నా అభిమానులను కొట్టించడం నాకు నచ్చదు. బౌన్సర్లను పెట్టుకున్నాం అంటే డబ్బులు ఇచ్చి అభిమానులను కొట్టించడానికే అనేది నా అభిప్రాయం. అందుకే అభిమానులకు నాకు మధ్య బౌన్సర్లు వద్దు అని భావిస్తాను.
నా ఫ్యాన్స్ ను కొట్టేందుకు బౌన్సర్లు ఎవరు.. కొడితే వారిని నేనే కొట్టాలి. మా మధ్య వారు ఎందుకు అన్నాడట. ఒక వేళ అభిమానులను నేను కొట్టిన సందర్భంలో వారు బాధపడితే వారితో నేను మళ్లీ ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా డీల్ చేసుకుంటాను అన్నట్లుగా బాలకృష్ణ చెప్పుకొచ్చారట.
ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా వారిలో బాలయ్య చాలా స్పెషల్.. ఆయన అభిమానులు అంతకు మించి స్పెషల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. అది నిజమే అన్నట్లుగా ఈ మాటలు వింటూ ఉంటే అనిపిస్తుంది కదా...!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.