ఈ ఏడాది సంక్రాంతి సినిమాగా వచ్చిన బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇటు తన కెరియర్లోను అటు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి సినిమా కెరియర్లోను ఒక మైలురాయిగా మిగిలిపోయింది. బాలకృష్ణ నటన - క్రిష్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను విజయపధం వైపు నడిపిచింది. యుద్ద సన్నివేశాల లో - పౌరాణిక పాత్రలో శాతవాహన చక్రవర్తిగా బాలకృష్ణ తన నట అనుభవాన్నంతా రంగరించి సినీ ప్రేక్షకులును ఆశ్చర్యనందాలుకు గురి చేశాడు. అందుకే ఇప్పుడు ఈ శాతకర్ణి సాంబార్ ల్యాండ్ లో కూడా తొడకొడుతున్నాడు.
తమిళ్లో పేరున్న హీరోల సినిమాలు అక్కడ హిటైన వెంటనే మన తెలుగులోకి కూడా డబ్ చేసి విడుదల చేస్తారు. మన తెలుగు హీరోలు కూడా ఈ మధ్య అలానే మొదలుపెట్టారు. అందుకే ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను ఎక్కువ ప్రేక్షకులుకు చేరువ చేసే పనిలో ఉన్నారు ఆ సినిమా యూనిట్. అందుకని గౌతమీపుత్ర శాతకర్ణిను తమిళ్లో కూడా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి తమిళ్ ఆడియో ఫంక్షన్ కూడా ఇవాళే (జూలై 10న) జరగబోతుంది. సినిమా కూడా తొందరలో తమిళ్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం తమిళనాడులో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ కలిసి ప్రోమోట్ చేస్తారట. పైగా ఈరోజు. ఆడియో ఫంక్షన్ కు కూడా వీళ్ళిద్దరూ హాజరై.. అక్కడ తొడకొడతారట.
బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాధ్ డైరక్షన్లో చేస్తున్న ‘పైసా వసూల్’ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఆ సినిమాను కూడా తమిళంలోకి వదలాలంటే.. ఇప్పుడు శాతకర్ణితో సాంబార్ ల్యాండ్లో సక్సెస్ కొట్టాల్సిందే. గతంలో క్రిష్ డైరెక్ట్ చేసిన ‘వేదం’ కూడా తమిళ్ రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టారు. మరి ఈ శాతకర్ణి తొడ కొట్టింగ్ అక్కడ ఏ రేంజులో క్లిక్కవుతుందో చూడాల్సిందే.