బాహుబలి తీసిన చోటే డిక్టేటర్‌

Update: 2015-08-28 08:07 GMT
బాహుబలి చిత్రాన్ని ఎముకలు కొరికే చలిలో తెరకెక్కించారు. మంచు కొండల్లో రాజమౌళి బృందం గొప్ప సాహసం చేసిందనే చెప్పాలి. మైనస్‌ డిగ్రీ చలిలోనూ డ్రెస్‌ ఛేంజ్‌ అనగానే తమన్నా ఏమాత్రం బిడియపడకుండా కారవ్యాను అయినా లేకుండా పక్కకు తిరగి డ్రెస్సు మార్చేసుకునేది. అలాంటి సాహసం తనకే చెల్లింది అంటూ రాజమౌళి తెగ పొగిడేశారు.

శివుడిపై కత్తిదూసి, బాణాలు సంధించి అవంతిక చేసే సాహస విన్యాసాలన్నీ తెరకెక్కించింది ఐరోపాలోనే. బల్గేరియాలోని అరుదైన లొకేషన్‌ లో ఈ కత్తి ఫైట్‌ తెరకెక్కించారు. మంచు దుప్పటి కప్పేసి చుట్టూ మిల్కీ కొండలే కనిపిస్తాయి. ఆ కొండ చరియ విరిగి మీదికి దూసుకొస్తుంటే.. అక్కడి నుంచి ఓ రాతి పలక సాయంతో అవంతికను రక్షిస్తాడు శివుడు. అదో ఎగ్జయిటింగ్‌ సీన్‌. అలాంటి సీన్‌ తీసిన చోట షూటింగ్‌ అంటే ఎవరికైనా ఎగ్జయిటింగ్‌ గానే ఉంటుంది.

ఇప్పుడు బాలకృష్ణ, శ్రీవాస్‌ అండ్‌ టీమ్‌ అక్కడికే వెళ్లారు. అక్కడ కీలకమైన యాక్షన్‌ సన్నివేశాల్ని, పాటల్ని తెరకెక్కించాలన్నది ప్లాన్‌. అంటే డిక్టేటర్‌ కి బాహుబలి ఎఫెక్ట్‌ స్పెషల్‌ అనే అనుకోవాలి. ఈ చిత్రంలో అంజలి, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.
Tags:    

Similar News