99వ సినిమాకే ఇంత హంగామా ఉంటే ఇక వందో సినిమాకు ఎల ఉంటుందో అనిపిస్తోంది బాలయ్య ‘డిక్టేటర్’ సినిమా విషయంలో జరుగుతున్న సందడి చూస్తుంటే. కోన వెంకట్, గోపీ మోహన్ లాంటి ఇద్దరు స్టార్ రైటర్లుండగా.. శ్రీధర్ సీపాన, రత్నం లాంటి ఇంకో పేరున్న ఇద్దరు రైటర్లు కలిసి వండిన కథ ఇది. లౌక్యం లాంటి సూపర్ హిట్ తో ఊపుమీదున్న శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. స్క్రిప్టు మీద నమ్మకంతో అతను నిర్మాతగా కూడా మారాడు. ఈరోస్ లాంటి ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాతో తొలిసారి తెలుగులో డైరెక్టుగా ఓ సినిమాను నిర్మిస్తోంది. షూటింగ్ మొదలైన నాటి నుంచి వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు.
డిక్టేటర్ కోసం బాలయ్య ఇంట్రడక్షన్ సాంగ్ ని ఓ రేంజిలో ప్లాన్ చేశారు. తొలిసారి బాలయ్యకు కొరియోగ్రఫీ చేస్తున్న ప్రేమ్ రక్షిత్.. బాలయ్య కెరీర్ లోనే ప్రత్యేకంగా ఉండేలా ఈ పాటను తీర్చిదిద్దుతున్నాడు. హైదరాబాద్ శివార్లలో బ్రహ్మ కడలి నేతృత్వంలో భారీ సెట్ నిర్మించి ఈ పాట షూట్ చేస్తున్నారు. వినాయకచవితి నేపథ్యంలో ‘గం గం గణేశ’ అనే పల్లవితో సాగే ఈ పాట కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. బాలయ్యకిది 99వ సినిమా కాబట్టి.. 99 మంది స్పెషలిస్టు డ్యాన్సర్లతో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో ఇంకో 2 వేల మంది దాకా డ్యాన్సర్లుంటారట. బాలయ్య కెరీర్ లోనే ఈ పాట ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. తమన్ ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడట. మొత్తానికి బాలయ్య 99వ సినిమా విషయంలో హంగామా మామూలుగా లేదు.