నిన్న అమరావతిలో కొత్తగా ప్రారంభించిన ఏపీ అసెంబ్లీ సాక్షిగా.. సీనియర్ స్టార్-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను సంచనలమే అవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమను అమరావతికి షిఫ్ట్ చేసే ప్రతిపాదన ఉందన్న బాలయ్య.. దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
అయితే.. హైద్రాబాద్ నుంచి తెలుగు సినిమాను షిఫ్ట్ చేయడం అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు నుంచి వినిపిస్తూనే ఉంది. విశాఖకు టాలీవుడ్ ను తరలించే ప్రతిపాదనలు కూడా చేశారు కానీ.. అవేవీ వర్కవుట్ కాలేదు. పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఆ తర్వాత ఈ విషయంపై పెద్దగా ఎవరూ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు బాలయ్య అమరావతికి టాలీవుడ్ అనడంతో.. మళ్లీ ఇది హాట్ టాపిక్ అయింది. హైద్రాబాద్ నుంచి తరలించడం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు అమరావతిలో టాలీవుడ్ అనగానే.. బోలెడన్ని ప్రతిపాదనలు తెరపైకి వచ్చేయడం ఖాయం.
అప్పట్లో మాదిరిగా 2-3 స్టూడియోలతో సరిపెట్టేసుకునే సిట్యుయేషన్ కాదు. పైగా ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని.. అనేక వసతులు-సౌకర్యాల కోసం రకరకాల ప్రపోజల్స్ వచ్చేయడం ఖాయం. ఇవన్నీ ప్రారంభం సంగతి పక్కన పెడితే.. ముందు అమరావతిలో ల్యాండ్స్ కోసం పోటీ పడ్డం అని చెప్పచ్చు. అప్పుడు వైజాగ్ పేరు చెబితే కదలని సినిమా పరిశ్రమ.. ఇప్పుడు అమరావతి అంటే కదులుతుందా అన్నదే అసలైన డౌట్!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/