'మ‌హానాయ‌కుడు' వాయిదా!?

Update: 2018-11-12 05:45 GMT
2018-19 సీజ‌న్‌ కి అత్యంత క్రేజీగా ప‌లువురి బ‌యోపిక్‌ లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ బ‌యోపిక్ అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఎన్టీఆర్ జీవితాన్ని రెండుగా విభ‌జించి క‌థానాయ‌కుడు - మ‌హానాయ‌కుడు పేరుతో క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ రెండిటికి రిలీజ్ తేదీల్ని ఇదివ‌ర‌కూ అధికారికంగా ప్ర‌క‌టించారు. క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి -9న  - మ‌హానాయ‌కుడు జ‌న‌వ‌రి 25న రిలీజ్ చేస్తామ‌ని తెలిపారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. క‌థానాయ‌కుడు చెప్పిన టైమ్‌ కే వ‌స్తున్నా మ‌హానాయ‌కుడు మాత్రం వాయిదా ప‌డ‌డం త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

ఒకే నెల‌లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తే ఆ మేర‌కు మొద‌టి భాగం రిలీజ్ చేస్తున్న పంపిణీదారులకు ఓ చిక్కుముడి ఉంద‌ని తెలుస్తోంది. కేవ‌లం రెండు వారాల గ్యాప్‌ లోనే ఇంత క్రేజీ చిత్రాన్ని రిలీజ్ చేస్తే - క‌థానాయ‌కుడు బాగా ఆడుతున్నా థియేట‌ర్ల నుంచి తీసేయాలి. అది డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాదు. అందువ‌ల్ల మ‌హానాయ‌కుడు డేట్‌ ని కాస్తంత అటువైపు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ట‌. దీంతో రిలీజ్ తేదీని మార్చేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి ఈ రిలీజ్ తేదీ మ‌త‌ల‌బుపై బాల‌య్య బాబు - క్రిష్ మ‌ధ్య విభేధాలు వ‌చ్చాయ‌ని - అయితే ఆ బాధ్య‌త త‌న‌కు వ‌దిలేయాల‌ని క్రిష్ కోర‌డంతో బాల‌య్య సైలెంట్ అయ్యార‌ని టాక్ వినిపించింది. మొత్తానికి బ‌య్య‌ర్లు - డిస్ట్రిబ్యూట‌ర్ల పోరుతో ఇప్పుడు రిలీజ్‌ ని మ‌రో మూడు వారాల పాటు దూరం జ‌రిపి - ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇలా అయితే హీరోతో ద‌ర్శ‌కుడికి.. పంపిణీదారుల‌తోనూ ఎలాంటి భేధాభిప్రాయం ఉండ‌ద‌ని తెలుస్తోంది. దీంతో మ‌హానాయ‌కుడు లాంటి క్రేజీ సినిమా వెన‌క్కి వెళ్లిపోయింది కాబ‌ట్టి, ఆ త‌ర్వాత క్యూలో ఉన్న క‌ళ్యాణ్ రామ్ - గుహ‌న్ కాంబో మూవీ - కార్తీ - దేవ్ జ‌న‌వ‌రి 25 రిలీజ్‌ కి సిద్ధ‌మైపోతున్నాయ‌ట‌.
   

Tags:    

Similar News