హిందీ.. తమిళంలోనూ ఎన్టీఆర్ సినిమా?

Update: 2017-10-13 14:18 GMT
నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత కథతో సినిమా తీయడానికి జోరుగానే సన్నాహాలు చేస్తున్నాడు. ఇన్నాళ్లూ వ్యవహారం కొంచెం తాపీగా నడిచింది కానీ.. రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసి.. త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తుండటంతో బాలయ్య త్వరపడక తప్పట్లేదు. తేజను దర్శకుడిగా కన్ఫమ్ చేసిన బాలయ్య ప్రి ప్రొడక్షన్ కూడా వేగవంతం చేశాడు.

వర్మ సినిమా మొదలవడాని కంటే ముందే బాలయ్య బృందం సినిమాను మొదలుపెట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంతో బాలయ్యే స్వయంగా నిర్మాత అవతారమెత్తుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ తో పాపులరైన విష్ణు ఇందూరి.. బాలయ్య సన్నిహితుడు సాయి కొర్రపాటి కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటంటే.. ఇది తెలుగుతో పాటు హిందీ.. తమిళ భాషల్లోనూ తెరకెక్కుతుందట. ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పాపులర్ కాబట్టి ఈ చిత్రం హిందీ.. తమిళ భాషల్లోనూ వర్కవుటవుతుందని భావిస్తున్నారట. తక్కువ బడ్జెట్లో సినిమాను తెరకెక్కించి.. మిగతా భాషల్లోనూ రిలీజ్ చేస్తే భారీగా లాభాలు అందుకోవచ్చని భావిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ విష్ణు.. సాయినే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
Tags:    

Similar News