నందమూరి నటసింహం బాలకృష్ణ 99 సినిమాల వరకూ సూపర్ స్పీడ్ లో కంప్లీట్ చేసేశారు. కానీ వందో మూవీ దగ్గరే కన్ఫ్యూజన్ మొదలైపోయింది. తన కెరీర్ లోనే స్పెషల్ గా మిగిలిపోయేలా ఈ సెంచరీ మూవీ ఉండాలని బాలయ్య భావిస్తుండడంతో.. ఎవరితో చేయాలనే అంశంపై నెలలు గడుస్తున్నా స్పష్టత రావడం లేదు. ఇప్పటికే బాలయ్య ల్యాండ్ మార్క్ సినిమాకి డైరెక్టర్ అంటూ చాలామంది పేర్లు వినిపించాయి.
మొదట బోయపాటితో బాలకృష్ణ వందో సినిమా ఉంటుందని అందరూ అనుకున్నా.. ఇప్పుడీ కాంబినేషన్ పై బాలయ్య ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ తర్వాత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 ఉంటుందని అంతా భావించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర కూడా బాలయ్య ఇదే మాట చెప్పడంతో.. ఇదే ఖాయమని ఫిక్స్ అయినా.. మళ్లీ ఈ ప్రాజెక్టును కూడా బాలయ్య పక్కన పెట్టేశారు. ఇక 'రామారావు గారు' అనే టైటిల్ తో పటాస్ ఫేం అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీని కూడా బాలకృష్ణ ఓకే చేశారనే టాక్ గట్టిగానే వినిపించింది. తండ్రి పేరుతో ఉన్న సినిమా కావడం.. స్టోరీ కూడా స్పెషల్ కూడా ఉందని అనడంతో.. అనిల్ రావిపూడి ఫిక్స్ అనుకున్నారు. ఇది కూడా ఏం తేలలేదు.
ఆ తర్వాత తెలుగు అంటే అమితంగా ఇష్టపడే బాలకృష్ణకి.. తెలుగుదనంతో సినిమాలు తీసే కృష్ణవంశీకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందన్నది ఎవరో సలహా ఇచ్చారు. ఈ మేరకు కృష్ణవంశీ కూడా కొన్ని రైటప్స్ ను ప్రిపేర్ చేసుకున్నాడని అంటున్నారు. ఇంతమంది డైరెక్టర్స్ ఇన్ని చెబుతున్నా బాలయ్య మాత్రం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అలాగని కాదని కూడా చెప్పడం లేదు. దీంతో ప్రతీ ఒక్కరికీ కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. పిక్చర్ చేసే విషయంలో బాలయ్య త్వరగా తేల్చేస్తే బాగుండని అనుకుంటున్నారు కానీ.. ఎవరూ పైకి చెప్పలేకపోతున్నారట.