ఈ ఏడాది కమర్షియల్ సినిమాలు అన్నింటిలోనూ ఏదో ఒక కొత్తదనం ఉంది. ఇక బాలయ్య విషయానికొస్తే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తరువాత ఎటువంటి సినిమాలు చేస్తాడా అని అనుకునే వాళ్ళకి పైసా వసూల్ సినిమా ఒక పెద్ద షాక్. ఎప్పుడూ తన గెటప్ ను ఇంత స్టైల్ గా మార్చుకోలేదు ఇటువంటి పోకరి డైలాగ్ లు చెప్పింది లేదు బాలయ్య. ఇప్పుడు ఈ రెండింటినీ సమపాళ్ళలో కలిపి మంచి విందు తయారు చేశాడు పూరీ జగన్నాధ్.
ఈ సినిమా దసరాకు రావాలిసింది కానీ అనుకున్న దానికంటే 28 రోజులు ముందుగానే వచ్చేస్తోంది. పైసా వసూల్ సినిమా సెప్టెంబర్ 29 వ విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఆ తేదిలలో మరో రెండు పెద్ద సినిమాలు రావడంతో అనవసరమైన ఒత్తిడికి గురి కావలిసివస్తుంది అని ఆలోచించి సెప్టెంబర్ 29 నుండి సెప్టెంబర్ 1 కి మార్చారట. అదే మాసంలో సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ జై లవ కుశ.. మహేశ్ స్పైడర్ సెప్టెంబర్ 27 న వస్తోంది. అయితే బాలకృష్ణ ఒకటిన రావడంతో మరో కుర్ర హీరో సినిమా జవాన్ సినిమా విడుదల తేది మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మధ్యనే పైసా వసూల్ స్టంపర్ కూడా విడుదల చేసి అంచనాలు పెంచారు కాబట్టి.. పైసా వసూల్ ధమాకా కోసం ఎదరుచూడాల్సిందే.
పైసా వసూల్ సినిమాకు సంబంధించి అన్ని డీల్స్ కూడా మాంచి మార్కెట్ తో ముగిశాయట. అనుకున్న తేది కన్నా ముందే రావడంతో సినిమా రైట్స్ కొన్నవాళ్లు బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్లు భారీగానే అని ఆశాభావంతో ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది లో వచ్చే ఒకానొక క్రేజీ ప్రాజెక్టు కావడం తో తెలుగు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా చూస్తుంది. అభిమానులు దృష్టిలో పులి లాంటి బాలయ్య ఏమి చేస్తాడో చూద్దాం. గెట్ రెడీ.