ఏఎన్నార్ పై బాలయ్య మాటలు దేనికి సిగ్నల్?

Update: 2017-12-25 15:30 GMT
ఎన్టీఆర్- ఏఎన్నార్.. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే వీరి ప్రస్తావన కచ్చితంగా ఉండాల్సిందే. అప్పట్లో వీరిద్దరూ కలిసి సినిమాలు చేశారు. చాలా సార్లు కలిసి కనిపించే వారు కూడా. అయితే.. ఫ్యాన్స్ మధ్య మాత్రం పోటీ కొనసాగేది.

నందమూరి - అక్కినేని కుటుంబాల మధ్య విబేధాలు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే పలు సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పాత సంగతులు పక్కన పెట్టినా.. రీసెంట్ గా మనంతో ఈ విషయాలు మళ్లీ జనాల నోళ్లలో నానాయి. ఆ మధ్యన వైజాగ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో.. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని బాలయ్య-నాగ్ చెప్పినా.. మనం తర్వాత మాత్రం రచ్చ బాగానే జరిగింది. ఆ సినిమాకు ఉత్తమ నంది రాకపోవడం వెనక బాలయ్య ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు బాలయ్య మాట్లాడిన మాటలు వింటే మాత్రం.. వివాదాలను వదిలేసినట్లేనా అనిపించక మానదు.

జైసింహా ఆడియో ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎన్టీఆర్-ఏఎన్నార్ లు ఇండస్ట్రీకి రెండు కళ్లు అన్నారు బాలయ్య. తండ్రిని ప్రశంసించడం ఎప్పుడూ జరిగేదే కానీ.. ఈ సారి సందర్భం లేకపోయినా ఏఎన్నార్ ప్రస్తావన తెచ్చిన బాలయ్య.. ఆయన నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నానని కూడా చెప్పడం ఆశ్చర్యకరమే. ఇదంతా చూస్తుంటే.. ఈ రెండు కుటుంబాల మధ్య విబేధాలు సమసిపోయాయని అనుకోవచ్చేమో!


Tags:    

Similar News