బండ్ల గణేష్ ఫ్యామిలీ సేఫ్...!

Update: 2020-06-20 16:25 GMT
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. ఇప్పటి దాకా కరోనా ఫ్రీ గా ఉన్న టాలీవుడ్ ఒక్కసారిగా ఈ వార్తతో కంగారు పడింది. కాగా బండ్ల గణేష్ జనరల్ చెకప్ చేయించుకుందామని హాస్పిటల్ కి వెళ్లగా మొదట కరోనా టెస్ట్ చేయించుకోవాలి అని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ కి కరోనా లక్షణాలు ఏమీ కనిపించినప్పటికీ పాజిటివ్ అని రావడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడట.

ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ వెంటనే తన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాడట. అయితే వారందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందట. ఇక బండ్ల గణేష్ ప్రస్తుతం డాక్టర్స్ సమక్షంలో హోమ్ ఐసొలేషన్ లో ఉన్నాడట. ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం బాగానే ఉందట. అయితే అతని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడి కరోనా నెగిటివ్ వచ్చే దాకా ఐసొలేషన్ లోనే ఉండనున్నారు. బండ్ల గణేష్ ఆఫీస్ స్టాఫ్ కి మరియు ఆయన ఇంట్లో పని చేస్తున్న వారికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారట. అయితే వారికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉందట.

ఇదిలా ఉండగా బండ్ల గణేష్ కి కరోనా వచ్చిందని తెలియడంతో ఇండస్ట్రీలో ఎవరెవరు అతనిని కలిశారో వాళ్ళదరు టెన్షన్ పడి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారట. ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా టెస్టులు చేయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా బండ్ల గణేష్ నివసించే ఏరియాలో ఉండే యువ హీరో నాగసౌర్య కూడా తనతోపాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం అయ్యారట. కేవలం నాగశౌర్యనే కాకుండా అక్కడ నివసించే ఇతర కుటుంబాలు కూడా కరోనా నిర్ధారిత పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.


Tags:    

Similar News