నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి చాలా సినిమాలు నిర్మించాడు. పెద్ద హీరోలతో సినిమాలను నిర్మించి బ్లాక్ బస్టర్ గణేష్ గా పేరు దక్కించుకున్న బండ్ల గణేష్ గత కొంత కాలంగా నిర్మాణంకు దూరంగా ఉన్నాడు. సినిమాల నిర్మాణం విషయంలో బండ్ల గణేష్ కాస్త వెనుకంజ ఉండటం వల్ల ఆయన నుండి అభిమానులు సినిమాలు కోరుకుంటూ ఉన్నారు. బండ్ల గణేష్ మళ్లీ పవన్ తో సినిమా ను నిర్మిస్తే చూడాలని కోరుకుంటున్నట్లుగా చాలా మంది అభిమానులు అడుగుతూ వస్తున్నారు.
నిర్మాతగా బండ్ల గణేష్ సినిమా ఎప్పుడు ఉంటుందో కాని నటుడిగా మాత్రం ఈయన సినిమాలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కమెడియన్ గా కనిపించిన బండ్ల గణేష్ ఆ తర్వాత మళ్లీ ఆఫర్లు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలే క్రేజీ అంకుల్స్ సినిమాలో నటించిన ఆయన త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. హీరోగా బండ్ల గణేష్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా కొన్ని వారాల క్రితమే వార్తలు వచ్చాయి. కాని ఆ సమయంలో ఆ వార్తలను చాలా మంది కొట్టి పారేశారు. కాని తాజాగా అదే నిజం అయ్యింది.
బాలీవుడ్ బిగ్ బిగ్ అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ తనయుడు తమిళంలో సూపర్ హిట్ అయ్యి జాతీయ అవార్డు కూడా దక్కించుకున్న ఒత్తా సెరుప్పు సైజు 7 ను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు అదే సినిమాను బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని బండ్ల గణేష్ కూడా కన్ఫర్మ్ చేశాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈ రీమేక్ పట్టాలెక్కబోతుంది. బండ్ల గణేష్ నటుడిగా ఎన్నో మంచి పాత్రలు చేశాడు. కనుక ఈ సినిమాతో ఆయన కొత్త జర్నీ ప్రారంభం అవుతుందని అంతా కూడా నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు.