రౌడీ దేవరకొండ అసాధారణ క్రేజ్ కి ఇదో పక్కా ఎగ్జాంపుల్. `రౌడీ` అన్న పదం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో - ఇరుగు పొరుగున ఏ రేంజులో మార్మోగిపోతోందో చెప్పేందుకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. రౌడీ అన్న పేరు ఉపయోగించి ఏకంగా బోలెడన్ని బిజినెస్ లు రన్ అవుతున్నాయంటే నమ్మగలరా?
ఇదిగో ఈ ఘటన గురించి తెలుసుకుంటే నమ్ముతారు. టాలీవుడ్ యువహీరో విజయ్ దేవరకొండకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు చెన్నయ్ - బెంగళూరు సహా మెట్రో నగరాల్లో - బాలీవుడ్ లోనూ వీరాభిమానులు ఏర్పడ్డారు. ఒకే ఒక్క `అర్జున్ రెడ్డి` తెచ్చిన ఇమేజ్ ఇది. ఆ సినిమాలో రౌడీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన దేవరకొండను అన్ని చోట్లా యువతరం పిచ్చిగా అభిమానిస్తున్నారు. రౌడీ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ కోట్లలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. వ్యాపారం పుంజుకునేందుకు ఆసరాగా ప్రచారానికి `రౌడీ` బ్రాండ్ ని వాడేస్తున్నారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా వాడేస్తున్న ఓ బెంగళూరు అప్పారెల్ కంపెనీకి రౌడీ తనదైన స్టైల్లో కోటింగ్ ఇవ్వడం ప్రధానంగా చర్చకు వచ్చింది. అసలేం జరిగింది? అంటే....
గ్రీన్ & క్లీన్ మెట్రో సిటీ బెంగళూరులో `రౌడీవేర్ ప్రయివేట్ లిమిటెడ్` పేరుతో ఓ వ్యాపారం సాగుతోంది. ప్రఖ్యాత అమెజాన్ డాట్ ఇన్ వెబ్ సైట్ లో సదరు కంపెనీ `జెనెరిక్` తరహా వ్యాపారం చేసేస్తోంది. రౌడీ అన్న బ్రాండ్ తో టీషర్టులు వంటి వస్త్ర వ్యాపారం చేసేస్తోంది. ఒకే తయారీ సంస్థ నుంచి ఈ బట్టలు అన్నీ వచ్చి ఇటు తెలుగు రాష్ట్రాలు - అటు కర్నాటకలోనూ వ్యాపారం సాగుతోందిట. అయితే దీనిని గమనించిన దేవరకొండ బెంగళూరు కోర్టులో పోరాడుతున్నారు. అతడి తరపు లాయర్ వాదన విన్న కోర్టు అమెజాన్ ఇండియాకి `ఇంటెరిమ్ ఆర్డర్`ని జారీ చేసింది. బట్టల అమ్మకాన్ని కొంతకాలం నిలుపుదల చేయాల్సిందిగా కోర్టు ఆర్డర్ వేయడం సంచలనమైంది. ఇలా అమ్మడం చట్ట విరుద్ధం అని తీర్పు వెలువరించడంపై ప్రస్తుతం సర్వాత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ కోర్టు వివాదంలో కర్నాటకకు చెందిన పలువురు ప్రముఖులు దేవరకొండకు అండగా నిలవడం ఆసక్తికరం. ప్రముఖ వ్యాపారి చింతన్ చిన్నప్పకు చెందిన స్పెక్ట్రమ్ లీగల్ భాగస్వామ్య సంస్థ దేవరకొండకు సాయంగా నిలుస్తోంది. ఆనంది కమాని - నిషాంత్ నందగోపాల్ - ప్రతిష్ఠ కెంపెగౌడ తదితరులు దేవరకొండకు అండగా నిలిచారు. మార్చి 29న తిరిగి ఈ వివాదంపై విచారణ సాగనుందని తెలుస్తోంది.