మలయాళంలో సూపర్ హిట్టయిన బెంగళూరు డేస్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడం గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. ఎన్నో రూమర్లు, మార్పులు చేర్పుల తర్వాత ఎట్టకేలకు పది రోజుల కిందట ఆర్య, రానా, బాబీ సింహా, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో తమిళ వెర్షన్ షూటింగ్ మొదలైపోయింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటిదాకా పొట్లూరి వరప్రసాద్, దిల్ రాజు కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తారని అనుకున్నాం కానీ.. ఇప్పుడు తమిళ వెర్షన్‌ను పీవీపీ వాళ్లకు వదిలేసి.. దిల్ రాజు తెలుగు వెర్షన్‌తో సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు తేలిపోయింది.
ఐతే తమిళ వెర్షన్ మొదలై షూటింగ్ కూడా ఊపందుకుంది కానీ.. తెలుగు వెర్షన్ సంగతేంటో తెలియడం లేదు. దిల్ రాజు చూస్తే 'ఓకే బంగారం' విడుదల వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడు. ఒక హీరో వరుణ్ తేజ.. కంచె కట్టే పనిలో తలమునకలైపోయాడు. శర్వానంద్‌కు వేరే ప్రాజెక్టులున్నాయి. ఖాళీగా ఉన్నది డైరెక్టర్ వేణు శ్రీరామ్ మాత్రమే. స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయిపోయిందని చెబుతున్నారు కానీ.. సినిమా ఎప్పుడు మొదలవుతుందో మాత్రం తేలడం లేదు. అసలీ సినిమా తెలుగులో ఉంటుందా లేదా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. ఈ అనుమానాలకు దిల్ రాజు ఎప్పుడు తెరదించుతాడో చూడాలి.