కింగ్ నాగార్జున నటిస్తున్నసూపర్ ఎక్జైటెడ్ ప్రాజెక్ట్ `బంగార్రాజు`. కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో వచ్చిన `సోగ్గాడే చిన్నినాయనా` చిత్రానికిది ప్రీక్వెల్. నాగ్ కెరీర్లోనే 50 కోట్ల మైలు రాయిని దాటి సరికొత్త రికార్డులు నెలకొల్పిన చిత్రమిది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్‌ని చేయాలని గత కొన్నేళ్లుగా నాగార్జున ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. స్క్రిప్ట్ పరంగా సంతృప్తి చెందకపోవడంతో ఇన్నాళ్లుగా ఈ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది.
తాజాగా ఎట్టకేలకు `బంగార్రాజు` పట్టాలెక్కింది. నాగార్జున టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చిన్న బంగార్రాజుగా నాగచైతన్య కనిపించనున్నారు. రమ్యకృష్ణ, `ఉప్పెన` ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలని దర్శకుడు కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతి బరిలో దింపాలని కింగ్ నాగార్జున ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి రేసులో హేమా హేమీలు పోటీపడుతున్నారు. ముందుగా ఈ రేసులో `ఆర్ ఆర్ ఆర్` దిగుతుండగా మరో పక్క ప్రభాస్ `రాధేశ్యామ్` రిలీజ్ డేట్ ని లాక్ చేసేసింది. ఇక రేస్ లో ఎవరున్నా తగ్గనంటూ `భీమ్లా నాయక్` జనవరి 12నే వచ్చేస్తున్నాడు. ఇదే డేట్‌కి తాను కూడా బరిలోకి దిగాలని `బంగార్రాజు` అదే మన కింగ్ నాగార్జున గట్టి పట్టుదలతో వున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సంక్రాంతి బరిలో ఇంత పోటీ వున్నా `బంగార్రాజు` కూడా ఎక్కడా తగ్గేదిలే అంటూ బరిలోకి దిగడానికి కాలుదువ్వుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే కింగ్ నాగ్ అధికారికంగా రిలీజ్ డేట్‌ని ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.