బాట్లా హౌస్ వర్క్ అవుట్ అయ్యిందా ?

Update: 2019-08-17 05:07 GMT
మొన్న ఇండిపెండెన్స్ రోజు అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ తో పాటుగా విడుదలైన జాన్ అబ్రహం బాట్లా హౌస్ డీసెంట్ ఓపెనింగ్స్ తో పాటు మంచి టాక్ ను సొంతం చేసుకుని వర్క్ అవుట్ చేసుకునే దిశగా వెళ్తోంది. మనకు రణరంగం-ఎవరు రెండు క్రేజీ స్ట్రెయిట్ మూవీస్ ఉండటంతో బాలీవుడ్ సినిమాలను మొదటి రోజు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత మూవీ లవర్స్ వీటిపైన కన్ను వేయడం మొదలుపెట్టారు. మిషన్ మంగళ్ ఇప్పటికే సేఫ్ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తోంది.

బాట్లా హౌస్ విషయానికి వస్తే ఢిల్లీలోని ఓ గల్లీలో విద్యార్థుల ముసుగులో ఉన్న తీవ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కేకే (రవికిషన్) ఆధ్వర్యంలో వాళ్ళ రూమ్ మీద ఎటాక్ చేస్తారు. ఆపరేషన్ ని లీడ్ చేస్తున్న సంజయ్ (జాన్ అబ్రహం)వచ్చేలోపే కేకేకు టెర్రర్రిస్ట్ బులెట్ తగిలి ప్రాణాలు కోల్పోతాడు. దాడిలో ఇద్దరు తీవ్రవాదులు మరణిస్తారు. కానీ ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని మైనారిటీ సంఘాలతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు రచ్చ చేయడంతో సంజయ్ టీమ్ మీద జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశాలు వస్తాయి. దీన్నుంచి సంజయ్ తన టీమ్ ని ఎలా కాపాడి తప్పించుకున్న తీవ్రవాదిని పట్టుకున్నాడు అనేదే అసలు కథ

కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే బాట్లా హౌస్ అద్భుతమైన కథ. విడివిడిగా భాగాలుగా చూస్తే కట్టిపడేసే ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి. ఓవరాల్ గా ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అనిపించుకోవడంలో మాత్రం బాట్లా హౌస్ తడబడింది. సంజయ్ ఎమోషన్స్ ని ఎక్కువగా చూపించే క్రమంలో అవసరం లేని లెన్త్ ని పెంచడం
ఫ్లోని దెబ్బ తీసింది.

ఇంటర్వెల్ బ్లాక్ ని సూపర్బ్ గా తీసిన దర్శకుడు నిఖిల్ అద్వానీ మళ్ళీ ఆ రేంజ్ టెంపో ప్రీ క్లైమాక్స్ నుంచి చూపించాడు. నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్లు వ్యవస్థలోని కొందరు స్వార్థపరుల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారో చక్కగా చూపించారు. ఇరికించిన ఐటెం సాంగ్-సాగదీసిన ఎమోషన్ బాట్లా హౌస్ కు స్పీడ్ బ్రేకర్ గా మారాయి. వాటిని మినహాయించి భరిస్తే దీన్ని ఖచ్చితంగా వన్ టైం వాచ్ క్యాటగిరీల్లో వేయొచ్చు.

    
    
    

Tags:    

Similar News