హిట్లు ఫ్లాపుల సంగతి పక్కన పెడితే.. టాలీవుడ్లో గుర్తింపు ఉండే యువహీరోలలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సాధారణ ప్రయణీకుడిగా మారిపోయి హైదరాబాద్ మహా నగరంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించాడు. డైలీ కమ్యూట్ సీరీస్ పేరుతో తన ఇన్స్టా ఖాతా ద్వారా ఆ ప్రయాణాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను నెటిజనులతో పంచుకున్నాడు.
హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్న ఫోటోకు 'మెట్రో' చాలా కన్వీనియంట్ గా ఉందని.. ఇలాంటి సూపర్బ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని మనం అభినందించాలని అభిప్రాయపడ్డాడు. ఇక ఆర్టీసీ సిటీ బస్ లో ప్రయాణిస్తున ఫోటోకు సిటీ బస్ లో ఇలా ప్రయాణించడం మొదటి సారి అని..తనకు ఇదో ప్రత్యేకమైన అనుభూతి అని.. ఎంజాయ్ చేశానని తెలిపాడు.
ఒక షేర్ ఆటోలో కూడా ప్రయాణించాడు. కాకపోతే ఆ ఫోటో కాస్త మసగ్గా ఉంది. అయితే ఈ ఫోటోలన్నిటిలో హైలైట్ మాత్రం బైక్ పైన ట్రిపుల్ రైడింగ్ చేయడం. పైగా హెల్మెట్ ధరించకుండా .. బైకుపై అలా నిలబడి పోజివ్వడం. దీనికి "బైక్ పై ట్రిపుల్స్.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నానని నాకు తెలుసు అయితే జస్ట్ ఇది ఫోటో కోసం మాత్రమే" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి ఆల్రెడీ విమర్శలు వెల్లువెత్తాయి. మరి హైదరాబాద్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ కూడా స్పందిస్తారేమో వేచి చూడాలి. ఎదేతైనేం.. ఓవరాల్ గా బెల్లంకొండ బాబు ప్రయాణాలు నెటిజనులకు విపరీతమైన ఆసక్తిని కలిగించాయి.