బిగ్ బాస్ 11: ఈమె పిచ్చ హాటు గురూ

Update: 2017-10-03 10:46 GMT
సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 11వ వర్షన్.. అదేనండీ 11వ సీజన్.. ఆల్రెడీ హిందీలో షురూ అయ్యింది. ఈసారి కూడా ఛమక్కులేపే కంటెస్టెంట్లను.. కిర్రెక్కించే మోడల్స్ ను బాగానే ఎన్నుకుంది బిగ్ బాస్ టీమ్. వారిలో ముఖ్యంగా హాట్ మోడల్ అర్షి ఖాన్.. అలాగే బొంబాయిలో సెటిల్ అయిన ఫారిన్ మోడల్ లుసిండా నికోల్స్ తన హొయలు పోతున్నారు. అయితే వీరందరికంటే కూడా నెటిజన్లకు ప్రియమైన హాట్ కంటెస్టంట్ ఒకమ్మాయి ఉందిలే.

ఎం టివి చూసేవారికి.. రోడీస్ ఫోర్ లో కంటెస్టంట్ గా పరిచయమై ఆ తరువాత క్యాంపస్ డైరీస్ అనే కార్యక్రమాన్ని హోస్టింగ్ చేసిన బెనాఫ్షా సూనావాలా అంటే సుపరిచితమే. ఈ అమ్మడి ఇన్  స్టాగ్రామ్ ఎకౌంట్లోకి తొంగిచూస్తే.. బికినీల్లోకి ఇమిడిపోయి తన ఒంపుసొంపులను కవ్వింపుతో కలిపి ఆరేస్తున్న ఫోటోలే దర్శనమిస్తాయి. పైగా అమ్మడు మాంచి డ్యాన్సర్ కూడా. బిగ్ బాస్ 11 ఓపెనింగులో కూడా తన వయ్యారాలను వలకబోసిన ఈ సన్నపాటి సుందరి.. కుర్రాళ్ళకు కైపెక్కిచ్చింది. అసలే మాటకారి.. ఆపై గడసరి.. దానికితోడు ఒంపుసొంపుల సొగసరి.. కాబట్టి ఈమెకు ఎక్కువమంది అభిమానులు ఏర్పడినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

ఇకపోతే మోడల్ అర్షి ఖాన్.. అలాగే డ్యాన్సర్ లుసిండా నికోల్స్ కూడా తక్కువేం కాదు. ప్రస్తుతానికి వీరు బెనాఫ్షా నుండి విపరీతమైన కాంపిటీషన్ ఎదుర్కొంటున్నప్పటికీ.. ఎవరి హాట్నెస్ వారిదే అంటున్నారు చూపరులు. అది సంగతి.
Tags:    

Similar News