భలే భలే మగాడివోయ్ సినిమా విషయంలో దర్శక నిర్మాతల కాన్ఫిడెన్స్ చూసి.. నిజంగా సినిమాకు అంత సీనుందా? లేక ఊరికే హైప్ కోసం అతి చేస్తున్నారా? అని చాలా సందేహాలు వినిపించాయి ఇండస్ట్రీలో. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 800 థియేటర్లలో సినిమాను విడుదల చేయడం చూసి.. నానికి అంత సీనుందా అన్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో 110 స్క్రీన్స్ లో సినిమా వదలడం చూసి టూమచ్ అన్నారు. వచ్చేదంతా ఖర్చులకే పోతుంది.. ఏం మిగులుద్ది అని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు సినిమా జోరు చూసి అలా ఎద్దేవా చేసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ స్టార్ హీరో సినిమా స్థాయిలో ప్రభంజనం సాగిస్తోంది భలే భలే మగాడివోయ్.
భలే భలే మగాడివోయ్ తొలి రోజు వసూళ్ల కంటే కూడా రెండో రోజు ఎక్కువుండటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లోని మెజారిటీ థియేటర్లు హౌస్ ఫుల్స్ తో నడుస్తుండగా.. ఎక్కడా 80 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారానికి మల్టీప్లెక్సులన్నింట్లోనూ బుకింగ్స్ అయిపోయాయి. సింగిల్ స్క్రీన్ ల బుకింగ్స్ కూడా జోరుగా సాగాయి. శనివారం సాయంత్రం చాలా చోట్ల బ్లాక్ లో టికెట్లు అమ్మే పరిస్థితి కనిపించింది. ఆదివారం థియేటర్ల దగ్గర మరింతగా సందడి ఉంటుందని అర్థమవుతోంది. చాలా పట్టణాల్లో రెండో రోజు నుంచి థియేటర్ లు యాడ్ చేయడం విశేషం. ‘శ్రీమంతుడు’ తర్వాత మళ్లీ ఇప్పుడే థియేటర్లు కళకళలాడుతున్నాయి.