అమెరికాలో నాని సంచ‌ల‌నం

Update: 2015-09-07 04:31 GMT
ఇప్ప‌టిదాకా అమెరికాలో స్టార్ హీరోల సినిమాలే స‌త్తా చూపించాయి. చిన్న హీరోల సినిమాలు ఏదో విడుద‌ల కావాలంటే కావాల‌న్న‌ట్టుగా  అయ్యేవి. చాలా చాలా బాగుంద‌న్న టాక్ వినిపిస్తే ఏవో కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేసుకొని తిరిగొచ్చేవి. అయితే... ఓ  చిన్న సినిమాగానే విడుదలైన నాని `భ‌లే భలే మగాడివోయ్‌` మాత్రం స్టార్ హీరోల చిత్రాల రేంజులో ఆద‌ర‌ణ సొంతం చేసుకొంటోంది. చూస్తుంటే నెక్ట్స్ వీకెండ్‌ కి  మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ ని అధిగ‌మించేలా ఉంది.

 ఇదివ‌ర‌కు ఒక సినిమా అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసిందంటే ఓ గొప్ప విష‌యంగా చెప్పుకొనేవాళ్లం.  కానీ ఇప్పుడు నాని కూడా  ఆ ఫీట్‌ ని సాధించ‌నుండ‌డం విశేష‌మే మ‌రి.  అక్క‌డ శ‌నివారం వ‌ర‌కు వచ్చిన లెక్క‌ల ప్ర‌కారం `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` హాఫ్ మిలియ‌న్ డాల‌ర్లను అధిగ‌మించిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఆదివారం లెక్క‌లొస్తే ఆ వ‌సూళ్లు మ‌రింత‌గా పెరుగుతాయి. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు మారుతి స్వ‌యంగా ఓవ‌ర్సీస్‌ లో విడుద‌ల చేసిన‌ట్టు తెలిసింది. ఆయ‌న కేవ‌లం రూః 40ల‌క్ష‌ల‌కు కొని  అక్క‌డ విడుద‌ల చేశాడ‌ట‌. వ‌సూళ్లు మాత్రం ఇప్ప‌టికే రూః 4కోట్లు దాటాయి. అంటే మారుతికి ఆ సినిమా క‌నీ వినీ ఎరుగ‌ని లాభాలు తెచ్చిపెట్ట‌బోతోంద‌న్న‌మాట‌.

అగ్ర హీరోల సినిమాలే అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్ల మార్కుని అధిగ‌మించ‌డం గ‌గ‌న‌మ‌య్యేది. కానీ `బాహుబ‌లి` అక్క‌డ ఏకంగా ఐదు మిలియ‌న్ల డాల‌ర్ల‌ను  సొంతం చేసుకొని ట్రేడ్‌ వ‌ర్గాల్ని విస్మ‌యానికి గురిచేసింది. `శ్రీమంతుడు` రెండున్న‌ర మిలియ‌న్ల‌ను  సొంతం చేసుకొంది. మ‌న మార్కెట్ అక్క‌డ విస్తృత‌మైన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇలాంటి మంచి వాతావ‌ర‌ణంలో విడుద‌లైన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`కి కూడా అమెరికా తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు. మంచి కామెడీ ఎంట‌ర్‌ టైనర్‌ గా, స్ట్రెస్ బ‌స్ట‌ర్‌ గా అనిపిస్తుండ‌టంతో ఆ సినిమాకి మంచి క్రేజ్ నెల‌కొంది.
Tags:    

Similar News