బన్నీ.. మహేష్‌.. చూపు కూడా అటే

Update: 2018-03-21 06:01 GMT
సినిమా ఫంక్షన్స్ అంటే ఇప్పటివరకూ హైద్రాబాద్ మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత.. ఏపీలో కూడా సినిమా వేడుకలు జరుగుతున్నాయి కానీ.. అడపాదడపా మాత్రమే. ముఖ్యంగా పెద్ద హీరోలు వరుసగా తమ ఫంక్షన్స్ ను ఏపీలో చేయడం అంతగా కనిపించలేదు. కానీ 2018లో మాత్రం ట్రెండ్ మారుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇప్పటికే రామ్ చరణ్ మూవీ రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖ పట్నంలో నిర్వహించారు. ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఇదే బాట పడుతున్నాయి. సమ్మర్ కి వస్తున్న భారీ బడ్జెట్ టాలీవుడ్ మూవీస్ అన్నీ విశాఖ వైపే చూస్తున్నాయి. మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా విశాఖలోనే నిర్వహించనున్నారట. ఏప్రిల్7న ఈ వేడుకను ప్లాన్ చేయగా.. ఇప్పటికే లోకల్ అధికారుల నుంచి పర్మిషన్స్ కూడా తీసేసుకున్నారని తెలుస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ లో మహేష్ బాబు మూవీ ఈవెంట్ ను నిర్వహించడం ఇదే తొలి సారి కావడంతో.. భారీ ఎత్తున జనాలు అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. మరోవైపు నా పేరు సూర్య విషయంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లోనే నిర్వహిస్తారట. సరైనోడు కు వైజాగ్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన బన్నీ.. బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ ను కంటిన్యూ చేయబోతున్నాడట. మొత్తానికి 2018 బిగ్గెస్ట్ ఈవెంట్స్ అన్నీ విశాఖకి వెళ్లిపోతున్నాయి.


Tags:    

Similar News