'ఆచార్య' చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హాలీడే కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సెట్స్ మీదున్న సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ నిలిపివేయబడ్డాయి. అయితే ఇటీవలే చిరు తిరిగి రావడంతో షూటింగ్స్ పునఃప్రారంభం అవుతున్నాయి.
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ''భోళా శంకర్'' ఒకటి. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళమ్’ చిత్రానికి అధికారిక రీమేక్ ఇది. తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు మంగళవారం నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.
ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో మెగా మాసివ్ కాంబోలో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షెడ్యూల్ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఓ భారీ సెట్ ను నిర్మించారని వెల్లడించారు.
ఈ సందర్భంగా సెట్ లో మెగా భారీ యాక్షన్ ఎపిసోడ్ గురించి ఫైట్ మాస్టర్స్ తో డైరెక్టర్ మెహర్ రమేష్ డిస్కషన్ చేస్తున్న ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా 'భోళాశంకర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్ అయినప్పటికీ మెహర్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా.. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 'స్వాగ్ ఆఫ్ భోళా' పేరుతో వదిలిన గ్లిమ్స్ కు మెగా అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అలానే చిరు లుక్ విశేషంగా ఆకట్టుకుంది. 'సైరా' తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి చిరంజీవి కి జోడీగా కనిపించబోతోంది.
మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఇందులో రఘు బాబు - రావు రమేష్ - మురళి శర్మ - రవి శంకర్ - వెన్నెల కిషోర్ - తులసి - ప్రగతి - శ్రీ ముఖి - బిత్తిరి సత్తి - సత్య - గెటప్ శ్రీను - రష్మీ గౌతమ్ - ఉత్తేజ్ - ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
రామబ్రహ్మం సుంకర సమర్పణలో AK ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ కో ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమాకు డూడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.