తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా మారి నటించిన తొలి సినిమా బిచ్చగాడు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుసగా డజను పైగా సినిమాల్లో హీరోగా నటించేశాడు. అతడి స్క్రిప్టు ఎంపికలు ప్రతిసారీ హాట్ టాపిక్ అయినా ఆ తర్వాత ఎందుకనో విజయాలు మాత్రం దక్కలేదు. విజయ్ ఆంటోని కొన్ని వరుస ఫ్లాపులను చవి చూడాల్సి వచ్చింది. ఇటీవల అతడికి నటుడిగా పెద్ద గ్యాప్ వచ్చింది. కానీ ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలంటే తిరిగి బిచ్చగాడు రేంజు హిట్టు కొట్టాల్సి ఉంటుంది. అదే క్రమంలో అతడు ఇప్పటి సీక్వెల్ ట్రెండ్ లో బిచ్చగాడు 2తో కంబ్యాక్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. విజయ్ ఆంటోని తదుపరి బిచ్చగాడు 2 (పిచైక్కారన్ 2 తమిళం)ని ప్రారంభించాడు.
2022 ముగింపులో ప్రారంభమైన ఈ సీక్వెల్ పై కొంత బజ్ కూడా ఏర్పడింది. 2016 లో విడుదలైన బిచ్చగాడు (పిచైక్కారన్) ఇమేజ్ ఇప్పటికీ అతడికి ప్లస్ అనుకున్నా కెరీర్ ఆద్యంతం ఫ్లాప్ లు ఎదుర్కోవడం అతడిని విసిగించింది. అందుకే ఇప్పుడు కంబ్యాక్ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నాడు.
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పకులుగా ఉన్నారు. ఈ సీక్వెల్ ని తమిళంతో పాటు తెలుగు- కన్నడ- మలయాళ భాషలలో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 2023 వేసవి లో ఈ చిత్రం విడుదల కానుంది. నాలుగు భాషలలో పిచైక్కారన్ 2 కొత్త సెట్ పోస్టర్ లను విజయ్ ఆంటోని షేర్ చేయగా వైరల్ గా మారాయి. ఈ మూవీ శాటిలైట్- డిజిటల్ హక్కులను స్టార్ నెట్ వర్క్ కొనుగోలు చేసినట్లు కూడా ప్రకటించారు. పిచైక్కారన్ 2కి తెలుగులో బిచ్చగాడు 2 అని టైటిల్ నిర్ణయించగా.. కన్నడ వెర్షన్ కి `భిక్షుక 2` అని పేరు పెట్టారు. మలయాళ వెర్షన్ కి `భిక్షక్కరన్ 2`గా టైటిల్ ని ఫిక్స్ చేసారు. గత ఏడాది ఈ సినిమాని ప్రకటించగా ఇప్పటికి దీనిపై పూర్తి క్లారిటీ వచ్చింది.
ఆరేళ్ల క్రితం `బిచ్చగాడు` విడుదలైంది. ఈ సృష్టిలో కన్నతల్లి ప్రేమను మించినది ఇంకొకటి లేదు. చావు బతుకుల్లో ఉన్న తన తల్లి ఆరోగ్యం యోగక్షేమాల కోసం తన ఆస్తులు అంతస్తులు అధికారం దర్పాన్ని వదిలేసి బిక్షగాడిగా మారే యువ బబిజిస్ మేన్ కథే `బిచ్చగాడు`. 2016 లో రిలీజైన ఈ మూవీ కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుండి కథాంశం కంటిన్యూ అవుతుందని తెలిసింది. విజయ్ ఆంటోని దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం కావడంతో పిచైక్కారన్ 2 గురించి తమిళ పరిశ్రమలో చర్చ సాగుతోంది. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసారు. సంగీత దర్శకుడిగా నటుడిగా ప్రయత్నించిన విజయ్ ఆంటోని దర్శకుడిగాను విజయం అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సీక్వెల్ ను జాతీయ అవార్డు-విజేత `బరం` ఫేమ్ ప్రియా కృష్ణస్వామి తెరకెక్కిస్తారని తొలుత ప్రకటించారు. మెట్రో - కొడియిల్ ఒరువన్ ఫేమ్ ఆనంద కృష్ణన్ పేరు కూడా రేసులో వినిపించింది. కానీ చివరికి విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు.
తమిళరసన్- అగ్ని సిరగుగల్- ఖాకీ- కొలై- రత్తం- మజై పిడికథ మనితన్- వల్లి మయిల్ వంటి వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ ఆంటోని కెరీర్ లో పిచైక్కారన్ 2 (బిచ్చగాడు 2) కోసం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాడని సమాచారం. వరుస పరాజయాలతో కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. దీనినుంచి బయటపడాలంటే అతడు భారీ హిట్టు కొట్టి నిరూపించాల్సి ఉంది.