మజ్నుకి ఇదే మంచి ఛాన్స్

Update: 2019-01-17 13:06 GMT
ప్రస్తుతం సంక్రాంతి సీజన్ లో విన్నర్ గా ఎఫ్2 ఒక్కటే మహా జోరుగా ఉంది. పాజిటివ్ టాక్ వచ్చి ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ పబ్లిసిటీతో వినయ విధేయ రామ రెండూ ఒకే స్టాంప్ వేయించుకోవడం అన్నింటికన్నా పెద్ద ట్విస్ట్. ఇదిలా ఉంచితే 25దాకా ఇంకే పెద్ద సినిమాలు బరిలో లేవు. 25న మళ్ళి సందడి మొదలవుతుంది. ఆ రోజు సోలోగా బరిలో దిగుతున్నాడు అఖిల్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ మజ్నుపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. కెరీర్ మొదలుపెట్టి మూడేళ్లయినా కేవలం రెండు సూపర్ ప్లాప్స్ తో నెట్టుకుంటూ వచ్చిన అఖిల్ కు సాలిడ్ బ్లాక్ బస్టర్ చాలా అవసరం.

తమన్ ఆల్బమ్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం కొంత ఊరట కలిగిస్తోంది. అయితే కంటెంట్ తో మిస్టర్ మజ్ను అదరగొడతాడా అనేదే ఇప్పుడు అసలు సవాల్. ఇది ఒకరకంగా మంచి ఛాన్స్ అని చెప్పాలి. 25కంతా ఎంత లేదన్నా ఎఫ్2 దూకుడు తగ్గిపోతుంది. అదే రోజు పోటీలో ఉన్నది ఒక్క మణికర్ణికనే. అది కూడా ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే లైక్ చేసేది కాబట్టి మిగిలినవాళ్లకు మజ్నునే ఛాయస్ గా మిగులుతాడు. అయితే ఏ ఆప్షన్ లేదు కాబట్టి అందరూ ఇదే చూస్తారన్న గ్యారెంటీ లేదు. అఖిల్ గత సినిమాలు కూడా ఇలాగే పోటీ లేకుండా వచ్చినవే. అయితే ఆ అవకాశాన్ని వాడుకోలేదు.

మిస్టర్ మజ్ను కూడా మరీ స్పెషల్ గా అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ట్రైలర్ వచ్చాక అభిప్రాయాలు మారతాయేమో చూడాలి. అసలే డెబ్యూ మూవీతో అన్నయ్య చైతుతో షాక్ తిన్న నిధి అగర్వాల్ కు ఇది రెండో సినిమా. తొలిప్రేమతో  మెప్పించిన దర్శకుడు వెంకీ అట్లూరి మీద ఆశలన్నీ. చూడాలి మిస్టర్ మజ్ను ఎంతమేరకు మెప్పిస్తాడో. ఈ నెల 19న జూనియర్ ఎన్టీఆర్ అతిధిగా జేఆర్సి కన్వెన్షన్ లో మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ చేయబోతున్నారు. 
Tags:    

Similar News