వేల కోట్ల కుంభకోణంతో స్టాక్ మార్కెట్ ని ముంచేసిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితకథను వెండితెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. `ది బిగ్ బుల్` అనేది టైటిల్. అభిషేక్ బచ్చన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు . `బోల్ బచ్చన్` తర్వాత ఏడేళ్లకు అభిషేక్ - దేవగన్ రీయునైట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నారు. కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకూ ది బిగ్ బుల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తొలి పోస్టర్ కి చక్కని స్పందన వచ్చింది.
తాజాగా కొత్త సంవత్సర కానుకగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ని అందించాడు అభిషేక్ బచ్చన్. నిరుద్యోగి అని అంటారు కదా.. ఇదిగో ఇదే నా సినిమా కొత్త లుక్ అంటూ సెటైరికల్ వేలో ఓ పోస్టర్ ని రివీల్ చేశాడు. ఈ పోస్టర్ లో స్మాల్ బి లుక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏదో నిగూఢ రహస్యం దాగి ఉంది! అన్న అర్థం ఆ పోస్టర్ లో కనిపిస్తోంది. ష్...! అంటూ జనాల్ని నిశ్శబ్దంగా ఉండమని బెదిరిస్తున్న లుక్ ఉత్కంఠ పెంచింది.
హర్షద్ మెహతా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన స్టాక్ బ్రోకర్ కం ఆర్థిక నేరస్తుడు. 5వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన ఘనుడు. ఆయన జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ `ది ఊల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్`ని పోలి ఉంది. ఈ చిత్రంలో తొలుత స్ట్రగ్లింగ్ స్టార్ ఇలియానాను ఓ నాయికగా ఎంపిక చేసారు. కానీ అనూహ్యంగా ఇల్లీ ఆ ఛాన్స్ మిస్సయ్యింది.