పది సినిమాల వయసు దాటకుండానే టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ బాక్స్ ఆఫీస్ ఓపెనర్ గా అవతరించిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా టాక్సీవాలా ఈ శనివారం విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. కంటెంట్ వీక్ గా ఉన్న నోటా సైతం మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. సో క్రేజీగా కనిపిస్తున్న టాక్సీ వాలా అంతకు మించి బెటర్ గా రాబడుతుందనే నమ్మకంతో ట్రేడ్ సైతం ఉంది. ఇప్పుడు టాక్సీవాలా ముందు పెను సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే ఎడిట్ కాకుండా సీజే వర్క్ జరగని రఫ్ వెర్షన్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోందని సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.
గీత గోవిందంకు సైతం అచ్చం ఇలాగే జరిగింది కానీ రిలీజయ్యాక సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయేసరికి పైరసీ గొడవను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ అదే సమయంలోనే టాక్సీవాలా ప్రింట్ ను కూడా బయటికి తీసుకొచ్చారు. కానీ గీతతో పాటు యువి టీమ్ అలెర్ట్ గా ఉండటంతో డ్యామేజ్ ని తగ్గించారు. ఇప్పుడు టాక్సీవాలా దీన్ని ఫేస్ చేయాలి అంటే ఒకటే సమాధానం. కంటెంట్ తో కొట్టడమే. దానికి తోడు ముందు రోజు రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ పోటీలో ఉంది. టాక్సీవాలా షో పడే సమయానికి దాని పూర్తి రిపోర్ట్ వచ్చేస్తుంది కాబట్టి అది ఎంత వరకు ఛాలెంజ్ ఇస్తుంది అనేది ముందే క్లారిటీ వచ్చేస్తుంది.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం పైరసీ ఉదంతాన్ని చూసి అత్తారింటికి దారేదిని గుర్తుకు తెస్తున్నారు. అప్పుడు కూడా ఇదే త్వరలో ఫుల్ మూవీ లీకైపోయినా బ్లాక్ బస్టర్ అయ్యిందని టాక్సీవాలా కూడా అదే బాటలో నడుస్తుందని చెబుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఈ రెండు సవాళ్ళను ఎదురుకోవాల్సింది విజయ్ దేవరకొండ ఇమేజ్ తోనే. హారర్ జానర్ లో రూపొందిన టాక్సీ వాలా మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. రెగ్యులర్ థీమ్ లాగా కనిపించకపోవడంతో ఏ మాత్రం మెప్పించినా చాలు విజయ్ స్పీడ్ కు బ్రేకులు పడవు. మరి ఈ వ్యవహారమంతా శనివారానికి కొలిక్కి వచ్చేస్తుంది. చూడాలి టాక్సీ రైడ్ ఏ రేంజ్ లో రయ్యిమంటుందో.