అమెజాన్ ప్రైమ్ కు బిగ్ షాక్!

Update: 2022-09-06 12:41 GMT
డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లో నెట్ ఫ్లిక్స్ త‌రువాత లీడింగ్ ఓటీటీ ప్లాట్ ఫాంగా పేరున్న సంస్థ అమెజాన్ ప్రైమ్‌. గ‌త కొంత కాలంగా నెట్ ఫ్లిక్స్ తో పోటీప‌డుతూ దేశీయంగా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా భారీ స్థాయిలో చందాదారుల‌ని క‌లిగి వున్న సంస్థ‌గా రికార్డు సృష్టించింది. అయితే ఆ క్రేజ్ ని మ‌రింత‌గా పెంచుకోవ‌డంతో పాటు చందా దారుల్ని కూడా రికార్డు స్థాయిలో ఆక‌ర్షించాల‌నే ఆలోచ‌న‌లో భాంగా ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ ని భారీ మొత్తం వెచ్చించి ద‌క్కించుకుంది.

అదే 'ది రింగ్స్ ఆఫ్ ప‌వ‌ర్‌'. 'ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సిరీస్ నుంచి యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ఫాంట‌సీ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ పై అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ అంచ‌నాలు పెట్టుకుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 1 నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ఫాంట‌సీ డ్రామా కోసం అమెజాన్ ప్రైమ్ దాదాపుగా రూ. 465 మిలియ‌న్ లు (రూ. 3700 కోట్లు) ఖ‌ర్చు చేసింద‌ట‌.  

తొలి రెండు ఎపిసోడ్ లు భారీ స్థాయిలో బ‌జ్ ని క్రియేట్ చేస్తాయ‌ని, వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో త‌మ ఓటీటీకి చందాదారుల్ని తెచ్చిపెడ‌తాయ‌ని అమెజాన్ ప్రైమ్ వ‌ర్గాలు ఆశ‌గా ఎదురుచూశాయ‌ట‌. అయితే వారి ఆశ‌ల‌ని తాజా సిరీస్ అడియాశ‌లుగా మార్చింద‌ని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 6 రోజులుగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు రావాల్సి బ‌జ్ రాలేద‌ట‌. అంటే కాకుండా చందా దారుల్ని ఈ సిరీస్ ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింద‌ని, దారుణంగా డిజాస్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకుంద‌ని అమెజాన్ వ‌ర్గాలు వాపోతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

భారీ ఆశ‌లు పెట్టుకుని వేల కోట్లు కుమ్మ‌రించిన సిరీస్ భారీ స్థాయిలో షాక్ ఇవ్వ‌డంతో ఆమెజాన్ వ‌ర్గాల‌కు ఏం చేయాలో దిక్కుతోచ‌డం లేద‌ట‌. మొద‌టి రోజు రికార్డు స్థాయి వీవ‌ర్ షిప్ ని సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించినా ఆ త‌రువాత నుంచి ఈ సీరిస్ కు డిజాస్ట‌ర్ రివ్యూలు రావ‌డంతో క్ర‌మ క్ర‌మంగా వీవ‌ర్ షిప్ త‌గ్గుతూ వ‌స్తోంద‌ట‌. దీంతో 'ది రింగ్స్ ఆఫ్ ప‌వ‌ర్‌' ని ఓ డిజాస్ట‌ర్ గా తేల్చిన‌ట్టుగా చెబుతున్నారు.

జ‌ర‌గ‌బోయే న‌ష్టాన్ని ముందే గ‌మ‌నించిన అమెజాన్ వ‌ర్గాలు రివ్యూల‌ని మూడు రోజుల పాటు క‌ట్ట‌డి చేసినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ లాస్ నుంచి అమెజాన్ ప్రైమ్ ఎలా కోలుకుంటుందో చూడాలి అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News