బిగ్ బాస్ రియాలిటీ షో హంగామా గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇందులో జరిగే రచ్చ దానిపై చర్చలు అంతా ఇంతా కాదు. అన్ని భాషల్లోనూ ఈ షోకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వివాదాలు తలెతత్తినప్పుడు కంటెస్టెంట్ల మానసిక పరివర్తన ఎలా ఉంటుంది? లైవ్ లో ఎలా వ్యవరిస్తారు? రెగ్యులర్ జీవనంలో యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? కూల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఇలా మనిషిని చదివేసే షో ఇది. శని..ఆదివారాల్లో హోస్ట్ వచ్చేపుడు హడావుడి గురించి అందరికీ తెలిసిందే. ఇంటి సభ్యుల మధ్య విభేధాలతో వివాదాలు తలెత్తినప్పుడు..టాస్క్ లు ఇచ్చినప్పుడు హద్దు మీరిన ఘటనలెన్నో. ఒకర్ని ఒకరు దుర్భాషులాడుకోవడం..కొట్టుకోవడం..తిట్టుకోవడం వంటి చిన్న పిల్లల చేష్టలకు కొదవేం ఉండదు. బిగ్ బాస్ ని ఇష్ట పడేవాళ్లు ఆ షోను బాగా ఎంజాయ్ చేస్తుంటారు కానీ.. గిట్టని వాళ్లు తిట్టిపోస్తారు.
దీనిపై ఇప్పటికే బిగ్ బాస్ వ్యతిరేక వర్గం ఎప్పటికప్పుడు షోను ఉద్దేశించి తమదైన శైలిలో కామెంట్ల తో విరుచుకు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక సెక్షన్ కి ఇదే పని. అసలు ఏ పనీ పాటు లేక నిర్వహిస్తోన్న ఓ చెత్త గేమ్ షో!! అంటూ తీవ్రమైన కామెంట్లు వినిపిస్తుంటాయి. బిగ్ బాస్-తెలుగు సీజన్ 3 పై లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు టీవీ డిబేట్లలో ఈ షోపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. తాజాగా ఈ షోపై హీరోయిన్ తాప్సీ కూడా విరుచుకుపడింది. కంటెంస్టెంట్లనే కాదు...షో ని చూస్తూ ఎంజాయ్ చేసే ప్రేక్షకుల పైనా దాడి చేసింది. థప్పడ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న తాప్సీ బిగ్ బాస్ షో పై తనదైన శైలిలో చెలరేగింది.
ఒకప్పుడు బిగ్ బాస్ చాలా పద్దతిగా ఉండేది. ఎంతో ఆసక్తికరంగాను ఉండేది. కానీ రాను రాను షోలో హింస భయంకరంగా పెరిగి పోయింది. ఒకర్ని ఒకరు తిట్టుకోవడం.. గొడవలు పడటం చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేస్తోంది. ఇది బిగ్ బాస్ షోయేనా అన్న సందేహం కలుగుతోంది. నిజంగా బిగ్ బాస్ పరువు బజారున పడిందేమో అనిపిస్తుంది. ఇలాంటి షోను ప్రేక్షకులు అంతే ఆసక్తిగా చూడటం నచ్చలేదు. కంటెంస్టెంట్లు మధ్య జరిగే తగాదాలు ప్రేక్షకులు తమ ఇంట్లో కూడా జరిగితే ఇలాగే ఎంజాయ్ చేస్తారా? అని ప్రశ్నించింది. దీంతో తాప్సీ దూకుడు సోషల్ మీడియా లో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.